గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 28,740 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | India Post GDS Recruitment 2026 Apply Now :
India Post GDS Recruitment 2026 :
గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత తపాలా శాఖ (India Post) ఆధ్వర్యంలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి గాను భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 28,740 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పదవ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక జరగడం ఈ ఉద్యోగాల ప్రత్యేకత.
భారతదేశం లో అన్ని రాష్ట్రాల లో ఉన్న గ్రామీణ పోస్టల్ ఆఫీస్ లో పని చేయడానికి గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంతేకాదు వయస్సు కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు పదవ తరగతి లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు 5 ఫిబ్రవరి 2026 లోపు దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
India Post GDS Recruitment 2026 – ముఖ్యమైన వివరాలు:
ఈ నియామక ప్రక్రియ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పోస్ట్ ఆఫీసుల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో స్థిరమైన జీతం, భద్రత కలిగిన ఉద్యోగంగా నిలుస్తాయి.
సంస్థ పేరు: ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ( BPM )
2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ( ABPM )
3. గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 28,740
విద్య అర్హతలు:
1. అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి (10th Class) ఉత్తీర్ణులై ఉండాలి.
2. గుర్తింపు పొందిన బోర్డు నుండి చదివి ఉండాలి.
3. స్థానిక భాషలో ప్రాథమిక అవగాహన అవసరం.
4. కంప్యూటర్ ప్రాథమిక జ్ఞానం ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.
వయో పరిమితి:
1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
SC / ST అభ్యర్థులకు 5 ఇయర్స్, OBC అభ్యర్థులకు 3 ఇయర్స్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
పోస్టు ఆధారంగా జీతం ఈ విధంగా ఉంటుంది:
1. BPM ఉద్యోగాలకి నెలకి ₹18,500/- జీతం ఇస్తారు.
2. ABPM / GDS ఉద్యోగాలకి నెలకి ₹ 14,500/- జీతం ఇస్తారు.
3. ఇవి కాకుండా DA, ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము:
1. జనరల్ / OBC / EWS అభ్యర్థులు ₹100 చెల్లించాలి.
2. SC / ST / PwBD / మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం:
1. ఈ GDS ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
2. అభ్యర్థులను కేవలం పదవ తరగతి మార్కుల ఆధారంగా, మెరిట్ లిస్ట్ ద్వారా, ఎంపిక చేస్తారు.
3. ఎక్కువ మార్కులు సాధించిన వారికి ముందుగా అవకాశం లభిస్తుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
2. అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.
3. GDS Recruitment 2026 నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి.
4. కొత్త రిజిస్ట్రేషన్ చేయాలి.
5. వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
6. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
7. దరఖాస్తు ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 20 జనవరి 2026
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 4 ఫిబ్రవరి 2026
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 25 జనవరి 2026
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 5 ఫిబ్రవరి 2026
Official Website : Click Here
Notification pdf : Click Here
Apply Online : Click Here