Central Govt Jobs

933 పోస్టులతో జిల్లా కలెక్టర్, జిల్లా SP పోస్టుల నోటిఫికేషన్ విడుదల | UPSC CSE Notification 2026 Apply Now

calendar_month February 5, 2026 person chitra

933 పోస్టులతో జిల్లా కలెక్టర్, జిల్లా SP పోస్టుల నోటిఫికేషన్ విడుదల | UPSC CSE Notification 2026 Apply Now :

UPSC CSE Notification 2026:

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) ఒకటి. 2026 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ (SP) వంటి కీలకమైన పోస్టులను భర్తీ చేయడానికి UPSC CSE Notification 2026 అధికారికంగా విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 933 ఖాళీలు భర్తీ చేయనున్నారు. పరిపాలనా సేవలలో సేవలందించాలని కలగన్న లక్షలాది అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) నుంచి 933 పోస్టుల నోటిఫికేషన్ ను అధికారికం గా విడుదల చేయడం జరిగింది. ఇందులో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్, ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్, ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇంకా ఇతర గ్రూప్ A క్యాటగిరి పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా అర్హతలు కూడా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయస్సు కూడా 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మైన్స్, ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

UPSC CSE పోస్టుల వివరాలు- ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా కింది సేవలలో నియామకాలు జరుగుతాయి:

1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) – జిల్లా కలెక్టర్

2. ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) – జిల్లా SP

3. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS)

4. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS)

5. ఇతర కేంద్ర ప్రభుత్వ గ్రూప్-A సర్వీసులు పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 933

విద్య అర్హతలు:

ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి:

1. కనీస వయస్సు: 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1. జనరల్ / OBC అభ్యర్థులకు ₹100 /- ఫీజు చెల్లించాలి.

2. SC / ST / మహిళా అభ్యర్థులు: ఫీజు లేదు.

3. ఈ ఫీజు కూడా ఆన్లైన్ లో చెల్లించాలి.

శాలరీ వివరాలు:

1. UPSC CSE Jobs కి ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకి ₹1,00,000/- జీతం ఇస్తారు.

2. ప్రభుత్వ వసతులు, అధికారిక వాహనాలు, అన్ని రకాల అలవెన్సుస్ కూడా ఉంటాయి.

ఎంపిక విధానం:

UPSC CSE ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశలలో జరుగుతుంది:

1. ప్రిలిమినరీ పరీక్ష (Prelims)

ఆబ్జెక్టివ్ టైప్

స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే

2. మెయిన్స్ పరీక్ష (Mains)

రాత పరీక్షలు

అభ్యర్థి జ్ఞానం, విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు

3. ఇంటర్వ్యూ (Personality Test)

4. డాకుమెంట్స్ వెరిఫికేషన్

5. మెడికల్ టెస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. UPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

2. One Time Registration (OTR) పూర్తి చేయాలి.

3. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ నింపాలి.

4. ఫీజు చెల్లించి అప్లికేషన్ సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 4 ఫిబ్రవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 24 ఫిబ్రవరి 2026

Official Website : Click Here

Notification pdf : Click Here

Application Link : Click Here

For More Jobs Information 

Join Our What’s App Channel: Click Here

Join Our Telegram Channel: Click Here

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *