AP Anganwadi Jobs 2026 – రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు:
AP Anganwadi Jobs 2026 – రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు:
AP Anganwadi Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలకు మంచి అవకాశం వచ్చింది. AP ICDS Anganwadi Recruitment 2026 ద్వారా నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాజెక్టులలో అంగన్వాడీ కార్యకర్తలు (టీచర్), మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా రాత పరీక్ష లేకుండా నేరుగా ఎంపిక జరుగుతుంది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : నంద్యాల జిల్లాలో అంగన్వాడీ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు (టీచర్) : 07 పోస్టులు
2. అంగన్వాడీ ఆయాలు : 101 పోస్టులు
మొత్తం పోస్టులు : 108
విద్య అర్హతలు :
అంగన్వాడీ కార్యకర్త (టీచర్):
అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి
అంగన్వాడీ ఆయా:
1. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత అవసరం.
2. 10వ తరగతి అభ్యర్థులు లేని పరిస్థితిలో ఎక్కువ చదువు చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయోపరిమితి:
1. 01.07.2025 నాటికి కనీసం : 21 సంవత్సరాలు, గరిష్టం : 35 సంవత్సరాలు ఉండాలి.
2. SC/ST ప్రాంతాలలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేని పక్షంలో 18 సంవత్సరాల వారికి అవకాశం ఉంటుంది.
ఇతర అర్హతలు:
1. అభ్యర్థి తప్పనిసరిగా వివాహితురాలు అయి ఉండాలి.
2. సంబంధిత గ్రామానికి చెందిన స్థానిక నివాసితురాలు కావాలి.
జతపరచవలసిన పత్రాలు:
దరఖాస్తుతో పాటు ఈ క్రింది డాక్యుమెంట్లు సమర్పించాలి:
1. జనన ధృవీకరణ పత్రం / వయస్సు సర్టిఫికేట్
2. కుల ధృవీకరణ పత్రం (తాజా)
3. విద్యార్హత సర్టిఫికేట్లు (SSC మార్క్ లిస్ట్, TC)
4. నివాస ధృవీకరణ పత్రం
5. విధవరాలు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం
6. వికలాంగులైతే సంబంధిత సర్టిఫికేట్
7. ఆధార్ కార్డు
8. రేషన్ కార్డు
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన పత్రాల జిరాక్స్ కాపీలతో (సెల్ఫ్ అట్టెస్టేషన్ చేయాలి) కలిసి సంబంధిత CDPO కార్యాలయంలో సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 14 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 23 ఏప్రిల్ 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
Notification Pdf Click Here
Application Pdf Click Here
Official Website : Click Here