ఎటువంటి ఫీజు లేకుండా IIT హైదరాబాద్‌లో ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి | IIT Hyderabad Office Executive Recruitment 2026 :
ఎటువంటి ఫీజు లేకుండా IIT హైదరాబాద్‌లో ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి | IIT Hyderabad Office Executive Recruitment 2026 :
IIT హైదరాబాద్ ఉద్యోగాలు 2026 :
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రముఖ విద్యాసంస్థ Indian Institute of Technology Hyderabad (IITH) నుండి IIT హైదరాబాద్ ఉద్యోగాలు 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టును భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అభ్యర్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ IIT హైదరాబాద్ ఉద్యోగాలు 2026 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 01 ఖాళీని భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అదనంగా సంబంధిత రంగంలో కనీసం ఆరు నెలల పని అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.30,000 వరకు జీతం అందజేయనున్నారు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: Indian Institute of Technology Hyderabad లో ఉద్యోగాలు
పోస్టు పేరు: ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు: 01 పోస్టు
విద్య అర్హతలు :
1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
2. సంబంధిత రంగంలో కనీసం ఆరు నెలల పని అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి :
25 మే 2026 నాటికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
దరఖాస్తు రుసుము :
ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు అవసరం లేదు.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000/- వరకు జీతం అందిస్తారు.
ఎంపిక విధానం :
అభ్యర్థులను కింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:
1. రాత పరీక్ష
2. నైపుణ్య పరీక్ష
3. ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
రాత పరీక్ష సిలబస్ :
1. సాధారణ ఆప్టిట్యూడ్
2. MS Office ప్రాథమిక పరిజ్ఞానం
ఉద్యోగ స్థలం:
ఐఐటీ హైదరాబాద్, కండి, సంగారెడ్డి
ఎలా దరఖాస్తు చేయాలి?
1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
2. ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు.
3. అధికారిక వెబ్‌సైట్: IIT Hyderabad Careers
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 05 మే 2026
దరఖాస్తు చివరి తేదీ: 26 మే 2026.
Notification PDF Click Here
Official Website Click Here