AP ICDS అంగన్వాడీ ఉద్యోగాలు 2026 – రాత పరీక్ష లేకుండా 227 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం:
AP ICDS అంగన్వాడీ ఉద్యోగాలు 2026 – రాత పరీక్ష లేకుండా 227 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం:
AP ICDS అంగన్వాడీ ఉద్యోగాలు 2026 :
ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ నిరుద్యోగ మహిళలకు భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల్లో రాత పరీక్ష లేకుండానే విద్యార్హత మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేపడుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన స్థానిక వివాహిత మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. అంగన్వాడీ టీచర్ – 13 పోస్టులు
2. మినీ అంగన్వాడీ టీచర్ – 10 పోస్టులు
3. అంగన్వాడీ హెల్పర్ – 204 పోస్టులు
మొత్తం పోస్టులు : 227
విద్య అర్హతలు :
1. అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
2. స్థానిక వివాహిత మహిళలకు మాత్రమే అర్హత ఉంటుంది.
3. అవివాహిత మహిళలు ఈ పోస్టులకు అర్హులు కారు.
4. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో సంబంధిత రిజర్వేషన్ నిబంధనలు అమలులో ఉంటాయి.
5. అవసరమైతే తదుపరి విద్యార్హత కలిగిన అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
వయో పరిమితి :
1. 01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ఎస్సీ, ఎస్టీ హాబిటేషన్లలో అర్హులైన అభ్యర్థులు లేని పరిస్థితిలో 18 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించనున్నారు.
దరఖాస్తు రుసుము :
ఈ నియామకాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం వివరాలు :
1. అంగన్వాడీ టీచర్ – ₹11,500/-
2. మినీ అంగన్వాడీ టీచర్ – ₹7,000/-
3. అంగన్వాడీ హెల్పర్ – ₹7,000/- జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
1. విద్యార్హత మెరిట్ ఆధారంగా
2. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
3. రాత పరీక్ష నిర్వహించరు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు తమ సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి.
2. ఖాళీల వివరాలను గ్రామ లేదా వార్డు సచివాలయ నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించారు. పూర్తి వివరాలకు సీడీపీఓ కార్యాలయాలను సంప్రదించవచ్చు.
దరఖాస్తుతో జతపరచాల్సిన పత్రాలు:
నేటివిటీ / రెసిడెన్స్ సర్టిఫికేట్ / ఆధార్ కార్డు
10వ తరగతి మార్కుల మెమో
పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
కుల ధృవీకరణ పత్రం (SC/ST/BC అభ్యర్థులకు)
వికలాంగుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 07 మే 2026
దరఖాస్తుల చివరి తేదీ : 27 మే 2026

Notification Pdf Click Here
Application Pdf Click Here