South Indian Bank Recruitment 2026 : గ్రామీణ బ్యాంకు లో తెలుగు చదవడం, రాయడం వచ్చిన వారికి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు!
South Indian Bank Recruitment 2026 : గ్రామీణ బ్యాంకు లో తెలుగు చదవడం, రాయడం వచ్చిన వారికి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు!
South Indian Bank Recruitment 2026 :
నిరుద్యోగ యువతకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగావకాశం లభించింది. South Indian Bank తాజాగా జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 13 మే 2026లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. తెలుగు చదవడం, రాయడం తెలిసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.4.86 లక్షల నుంచి రూ.5.04 లక్షల వరకు CTC అందించనున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : సౌత్ ఇండియా బ్యాంకు లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్) పోస్టులు
విద్యార్హతలు :
1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
2. 10+2+డిగ్రీ సాధారణ విద్యావిధానంలో చదివి ఉండాలి.
3. బ్యాంక్ లేదా NBFC సంస్థల్లో కనీసం 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి :
1. 31-03-2026 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు.
2. ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు లేదు.
జీతం వివరాలు :
1. సంవత్సరానికి రూ.4.86 లక్షల నుండి రూ.5.04 లక్షల వరకు CTC.
2. ఇందులో NPS, ఇన్సూరెన్స్ మరియు పనితీరు ఆధారిత బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంపిక విధానం :
అభ్యర్థులను క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:
1. ఆన్లైన్ పరీక్ష
2. గ్రూప్ డిస్కషన్
3. ఇంటర్వ్యూ
4. అభ్యర్థుల సంఖ్య ఆధారంగా బ్యాంకు అవసరమైతే పరీక్ష నిర్వహిస్తుంది.
ఎలా అప్లై చేసుకోవాలి ?
1. ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి, South Indian Bank Careers Portal
2. అధికారిక వెబ్సైట్లో “Junior Officer (Operations) Recruitment 2026” లింక్‌ను గుర్తించి దానిపై క్లిక్ చేయాలి.
3. నోటిఫికేషన్లో ఇచ్చిన అర్హతలు మరియు సూచనలను పూర్తిగా చదవాలి.
4. “Apply Online” బటన్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
5. అభ్యర్థి పేరు, విద్యార్హతలు, మొబైల్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలను సరిగా నమోదు చేయాలి.
6. అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటో మరియు సంతకం స్కాన్ కాపీలను అప్లోడ్ చేయాలి.
7. నమోదు చేసిన వివరాలను ఒకసారి పరిశీలించి Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
8. దరఖాస్తు సక్సెస్ అయిన తర్వాత అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకుని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 06 మే 2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 13 మే 2026
Notification PDF Click Here
Official Website Click Here
Apply Online Link Click Here