SSC అర్హతతో ప్రభుత్వ సైనిక్ స్కూల్‌లో హాస్టల్ వార్డెన్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Sainik School Satara Recruitment 2026 Apply Now :
SSC అర్హతతో ప్రభుత్వ సైనిక్ స్కూల్‌లో హాస్టల్ వార్డెన్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Sainik School Satara Recruitment 2026 Apply Now :
Sainik School Satara Recruitment 2026:
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని Sainik School Satara లో పలు బోధన మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా TGT ఉపాధ్యాయులు, ఆర్ట్ మాస్టర్, సంగీత టీచర్, ల్యాబ్ అసిస్టెంట్, స్కూల్ మెడికల్ ఆఫీసర్ మరియు హాస్టల్ వార్డెన్/మేట్రాన్ వంటి పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, B.Ed మరియు సంబంధిత అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత కలిగిన అభ్యర్థులు 09 మే 2026 నుండి 01 జూన్ 2026 వరకు దరఖాస్తులను పంపించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000/- నుండి ₹40,000/- వరకు జీతం అందించబడుతుంది. మరిన్ని పూర్తి వివరాలు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : సైనిక్ స్కూల్ సతారా లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : TGT, ఆర్ట్ మాస్టర్, సంగీత ఉపాధ్యాయుడు, లేబరటరీ అసిస్టెంట్, వార్డెన్/మేట్రాన్ తదితర పోస్టులు
మొత్తం ఖాళీలు : 13
ఉద్యోగ రకం: పర్మనెంట్
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
ఖాళీల వివరాలు :
TGT (గణితం) – 02
TGT (హిందీ) – 01
TGT (సామాజిక శాస్త్రం) – 01
TGT (మరాఠీ) – 01
ఆర్ట్ మాస్టర్ – 01
సంగీత ఉపాధ్యాయుడు – 01
లేబరటరీ అసిస్టెంట్ (ఫిజిక్స్) – 01
స్కూల్ మెడికల్ ఆఫీసర్ – 01
వార్డ్ బాయ్ / మేట్రాన్ – 03
విద్యార్హతలు :
TGT పోస్టులు :
సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో డిగ్రీ, B.Ed మరియు CTET/STET Paper-II ఉత్తీర్ణత అవసరం.
ఆర్ట్ మాస్టర్ :
ఫైన్ ఆర్ట్స్/డ్రాయింగ్/పెయింటింగ్ విభాగంలో గుర్తింపు పొందిన డిప్లొమా అర్హత ఉండాలి.
సంగీత ఉపాధ్యాయుడు :
సంగీతంలో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన సంగీత సంస్థలో శిక్షణ పూర్తి చేసి ఉండాలి.
లేబరటరీ అసిస్టెంట్ :
ఫిజిక్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత ఉండాలి.
స్కూల్ మెడికల్ ఆఫీసర్ :
MBBS పూర్తి చేసి ఉండాలి.
వార్డ్ బాయ్ / మేట్రాన్ :
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ మాట్లాడగల సామర్థ్యం ఉండాలి. రెసిడెన్షియల్ స్కూల్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
01 జూన్ 2026 నాటికి అభ్యర్థుల కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు రుసుము :
1. జనరల్ / OBC అభ్యర్థులకు – ₹250/-
2. SC / ST అభ్యర్థులకు – ఫీజు లేదు.
జీతం వివరాలు :
TGT పోస్టులు – ₹40,000/-
ఆర్ట్ మాస్టర్ – ₹32,000/-
సంగీత ఉపాధ్యాయుడు – ₹27,000/-
లేబరటరీ అసిస్టెంట్ – ₹25,000/-
స్కూల్ మెడికల్ ఆఫీసర్ – ₹30,000/-
వార్డ్ బాయ్ / మేట్రాన్ – ₹27,000/-
ఎంపిక విధానం :
1. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి పరీక్ష లేదా ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్లు పంపిస్తారు.
2. ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు అభ్యర్థులకు ఇమెయిల్ లేదా పోస్టు ద్వారా తెలియజేయబడతాయి.
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాల ప్రతులతో కలిసి క్రింద ఇచ్చిన చిరునామాకు పంపించాలి.
చిరునామా:
ప్రిన్సిపాల్,
సైనిక్ స్కూల్ సతారా,
పోస్ట్ బాక్స్ నెం-20, సదర్ బజార్,
సతారా జిల్లా, మహారాష్ట్ర – 415001
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ : 09 మే 2026
దరఖాస్తుల చివరి తేదీ : 01 జూన్ 2026
Notification & Application Pdf : Click Here
Office Website : Click Here