Information

Andhra Pradesh Talliki Vandanam 2026 : తల్లికి వందనం రూ.13,000/- పొందాలంటే ఇలా చేయండి.

calendar_month May 26, 2026 person chitra

Andhra Pradesh Talliki Vandanam 2026 : తల్లికి వందనం రూ.13,000/- పొందాలంటే ఇలా చేయండి.

AP తల్లికి వందనం 2026 :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో తల్లికి వందనం (Talliki Vandanam) ఒకటి. 2026-27 విద్యాసంవత్సరానికి ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.13,000 చొప్పున వారి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు సమాచారం.

గత సంవత్సరంలో ఆధార్ లింక్ సమస్యల వల్ల చాలా మంది లబ్ధిదారులు ఈ పథకానికి దూరమయ్యారు. ఈసారి అలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ముఖ్య సూచనలు చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

తల్లికి వందనం డబ్బులు రావాలంటే ఏమి చేయాలి?

ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే కింది విషయాలు తప్పనిసరిగా పూర్తి చేయాలి:

1. విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేయాలి.

2. బ్యాంకులో NPCI మ్యాపింగ్ పూర్తి చేయాలి.

3. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ యాక్టివ్‌గా ఉండాలి.

4. ఈ మూడు పూర్తిగా ఉంటేనే డబ్బులు ఖాతాలో జమ అవుతాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి?

1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం జూన్ 12 నుండి 15 తేదీల మధ్యలో డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం.

ఈ సంవత్సరం దాదాపు 75 లక్షలకుపైగా విద్యార్థులు అర్హులుగా గుర్తించబడ్డారు.

Talliki Vandanam Eligibility Criteria 2026 :

ఈ పథకం పొందాలంటే కింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి:

1. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.10,000 లోపు ఉండాలి.

2. పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.12,000 లోపు ఉండాలి.

3. వైట్ రేషన్ కార్డు ఉండాలి.

4. భూమి పరిమితి: మగాణి 3 ఎకరాలు / మిట్ట 10 ఎకరాల్లోపు

5. కుటుంబ సభ్యుల పేరుమీద నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు (టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు మినహాయింపు).

6. విద్యుత్ వినియోగం 6 నెలల సగటు 300 యూనిట్స్ లోపు ఉండాలి.

7. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్ పొందేవారు ఉండకూడదు.

8. Income Tax చెల్లించే వ్యక్తులు ఉండకూడదు.

9. విద్యార్థి కనీసం 75% హాజరు కలిగి ఉండాలి.

10. తల్లి బ్యాంక్ ఖాతా ఆధార్‌కు లింక్ అయి ఉండాలి.

Talliki Vandanam Status Check 2026 (Step by Step) :

తల్లికి వందనం స్టేటస్ తెలుసుకోవడానికి ఈ విధంగా చేయండి:

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. https://bm-sgsw.ap.gov.in/

2. కుటుంబ పెద్ద యొక్క 12 అంకెల ఆధార్ నెంబర్ నమోదు చేయండి.

3. Scheme Type లో “తల్లికి వందనం” సెలెక్ట్ చేయండి.

4. Year లో 2026-27 ఎంపిక చేయండి.

5. “Get Details” పై క్లిక్ చేయండి.

6. మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్‌కు OTP వస్తుంది.

7. OTP మరియు Captcha నమోదు చేసి Verify పై క్లిక్ చేయండి.

8. వెంటనే మీరు Eligible / Not Eligible స్టేటస్ చూసుకోవచ్చు.

Talliki Vandanam Status Check Link Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *