Govt. Schemes

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం వస్తుందా? రాదా? మొబైల్‌లో ఈజీగా చెక్ చేసుకోండి!

calendar_month June 2, 2026 person chitra

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం వస్తుందా? రాదా? మొబైల్‌లో ఈజీగా చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026:

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు శుభవార్త. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం (Talliki Vandanam) పథకం నగదు విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.13,000 ఆర్థిక సహాయం జమ చేయనున్నారు.

అయితే మీకు ఈ పథకం వర్తిస్తుందా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ ద్వారానే సులభంగా తెలుసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

తల్లికి వందనం డబ్బులు ఖాతాలో జమ కావాలంటే?

తల్లికి వందనం పథకం ప్రయోజనం పొందాలంటే విద్యార్థి తల్లి యొక్క:

1. ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉండాలి.

2. బ్యాంకు ఖాతాకు NPCI మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి.

3. ఆధార్‌లో నమోదు చేసిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి.

4. ఈ వివరాలు సక్రమంగా ఉంటే ప్రభుత్వం విడుదల చేసే నగదు నేరుగా తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

తల్లికి వందనం పథకం అర్హతను ఎలా చెక్ చేయాలి?

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

2. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో కనిపించే “Scheme Eligibility” విభాగాన్ని ఎంచుకుని దానిపై క్లిక్ చేయండి.

3. తల్లి యొక్క ఆధార్ నంబర్ నమోదు చేయండి.

4. Scheme Type వద్ద తల్లికి వందనం ఎంపిక చేయండి.

5. సంబంధిత Year ఎంచుకుని Get Details పై క్లిక్ చేయండి.

6. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

7. OTP నమోదు చేసిన వెంటనే లబ్ధిదారుల వివరాలు కనిపిస్తాయి.

Validation Status లో ఏమి చూడాలి?

1. లబ్ధిదారుల వివరాల్లో కిందికి స్క్రోల్ చేస్తే Scheme Eligibility Check అనే విభాగం కనిపిస్తుంది.

2. Validation Status వద్ద అన్ని అంశాలు Satisfied అని కనిపిస్తే ఎలాంటి సమస్య లేదు.

3. ఏదైనా Rejected, Pending లేదా Error అని కనిపిస్తే వెంటనే మీ గ్రామ/వార్డు సచివాలయంను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి.

4. అర్హత పరిశీలనలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని వెంటనే సరిచేసుకోవడం ద్వారా తల్లికి వందనం పథకం 2026 కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు.

ముఖ్య గమనిక :

తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హత వివరాలు, ఆధార్-బ్యాంక్ లింకింగ్, NPCI మ్యాపింగ్ వంటి అంశాలను ముందుగానే తనిఖీ చేసుకోవడం ద్వారా చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసుకోవచ్చు.

Talliki Vandanam Scheme Eligibility Check Link

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *