District Court Jobs 2026: జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో దరఖాస్తులకు ఆహ్వానం!
District Court Jobs 2026: జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో దరఖాస్తులకు ఆహ్వానం!
District Legal Services Authority Recruitment 2026 :
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ (DLSA) జూనియర్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.18,500 వేతనం అందించనున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 18 జూన్ 2026లోపు దరఖాస్తు సమర్పించాలి.
District Court Junior Assistant Vacancy 2026 – పోస్టుల వివరాలు :
సంస్థ పేరు: జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ (DLSA) లో ఉద్యోగాలు
పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్
ఖాళీల సంఖ్య: 01
ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్ ప్రాతిపదిక
అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్
విద్యార్హతలు :
జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
1.గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా లా విభాగాల్లో ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. కంప్యూటర్ ఆపరేషన్లపై ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి.
3. నియామకం జరిగే జిల్లా స్థానిక భాషను చదవడం, రాయడం మరియు మాట్లాడడంలో తగిన నైపుణ్యం ఉండాలి.
వయో పరిమితి :
1. సెప్టెంబర్ 2026 నాటికి అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి.
2. గరిష్ట వయో పరిమితి 34 సంవత్సరాలు.
వయో సడలింపులు :
1. SC / ST / BC / EWS అభ్యర్థులకు – 10 సంవత్సరాలు
2. OC అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
3. దివ్యాంగ అభ్యర్థులకు – 10 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము :
1. OC & BC అభ్యర్థులు – రూ.800/-
2. SC / ST అభ్యర్థులు – రూ.400/-
గమనిక: దరఖాస్తు రుసుమును “కార్యదర్శి, జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ, సిద్దిపేట” పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ (Demand Draft) రూపంలో చెల్లించాలి.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,500/- వేతనం చెల్లించబడుతుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:
1. OMR ఆధారిత రాత పరీక్ష
2. సర్టిఫికెట్ల పరిశీలన (Document Verification)
3. వైవా-వోస్ / ఇంటర్వ్యూ
4. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితా రూపొందించబడుతుంది.
దరఖాస్తు విధానం :
1. అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపి, అవసరమైన పత్రాలతో కలిసి రిజిస్టర్డ్ పోస్టు లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపించాలి.
2. ప్రత్యక్షంగా సమర్పించిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవు.
3. దరఖాస్తు పంపే కవర్‌పై “Application for the Post of Junior Assistant” అని స్పష్టంగా పేర్కొనాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 18 మే 2026
దరఖాస్తుల చివరి తేదీ: 18 జూన్ 2026
దరఖాస్తుల పరిశీలన: 19 జూన్ 2026
Notification & Application Pdf Click Here
Office Website Click Here