Pre-Primary School Jobs 2026: ఎటువంటి రాత పరీక్ష లేకుండా 7వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇన్స్ట్రక్టర్ & ఆయా ఉద్యోగాలు | Pre-Primary School Instructor & Aaya Notification 2026 :
Pre-Primary School Jobs 2026: ఎటువంటి రాత పరీక్ష లేకుండా 7వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇన్స్ట్రక్టర్ & ఆయా ఉద్యోగాలు | Pre-Primary School Instructor & Aaya Notification 2026 :
TS Pre-Primary School Instructor & Aaya Recruitment 2026 :
సమగ్ర శిక్ష బాల్య సంరక్షణ మరియు విద్య (ECCE) కార్యక్రమం కింద 2026-27 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించనున్న ప్రీ-ప్రైమరీ విభాగాల కోసం ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. మొత్తం 2,769 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ నియామకాలలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులను అర్హత మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : TS Pre-Primary School లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్
2. ఆయా (Aaya)
మొత్తం ఖాళీలు: 2,769
విద్యార్హతలు :
ఇన్స్ట్రక్టర్ పోస్టు :
1. గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) లేదా సమాన అర్హత ఉత్తీర్ణత.
2. బాల్య విద్య లేదా ప్రాథమిక బోధనలో అర్హతలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఆయా పోస్టు :
కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి :
1. నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.
3. ఎస్సీ / ఎస్టీ / బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
4. మాజీ సైనికులకు – 3 సంవత్సరాలు
5. దివ్యాంగులకు – 10 సంవత్సరాలు
6. ఎంపికైన ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు పాఠశాల విద్యాశాఖ సూచించిన తప్పనిసరి శిక్షణను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
ఈ నియామకాలకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.8,000 నుంచి రూ.10,000 వరకు వేతనం అందజేస్తారు.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థులను అర్హత మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రాధాన్యత క్రమం:
అదే నివాస ప్రాంతం
అదే గ్రామ పంచాయతీ
అదే మండలం
అదే జిల్లా
డీఈడీ అర్హత లేని సందర్భంలో ఇంటర్మీడియట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. స్థానిక మండలానికి చెందిన అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
నియామక కమిటీ :
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, అదనపు కలెక్టర్ ఉపాధ్యక్షుడిగా, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) సభ్య-కన్వీనర్‌గా మరియు కలెక్టర్ నామినేట్ చేసిన సభ్యునితో కూడిన జిల్లా ఎంపిక కమిటీ నియామక ప్రక్రియను నిర్వహిస్తుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో పాటు దరఖాస్తులను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నిర్ణీత గడువులోపు సమర్పించాలి.
FullNotification Pdf : Click Here