AP Jobs

AP Government Jobs 2026 : రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month June 7, 2026 person chitra

AP Government Jobs 2026 : రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి.

AP Government Jobs 2026 :

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని కడప ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో కాంట్రాక్టు ప్రాతిపదికన పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి నుంచి ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అభ్యర్థుల ఎంపికను రాత పరీక్ష లేకుండా విద్యార్హతలు, మెరిట్ మరియు అవసరమైన పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహించనున్నారు.

ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జూన్ 04 నుంచి జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను కడప జిల్లా అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన ధ్రువపత్రాల ప్రతులతో కలిసి కడప ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని అదనపు డీఎంఈ/సూపరింటెండెంట్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH), కడప లో ఉద్యోగాలు

ఉద్యోగ విధానం : కాంట్రాక్ట్ ప్రాతిపదిక

దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్

పోస్టుల వివరాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. డాక్టర్ / సైకియాట్రిస్ట్

2. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్

3. వృత్తి విద్యా సలహాదారు

4. చౌకీదార్

5. హౌస్ కీపింగ్ సిబ్బంది

6. కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్

7. యోగా థెరపిస్ట్

8. డ్యాన్స్ టీచర్

9. మ్యూజిక్ టీచర్

10. ఆర్ట్ టీచర్ (పార్ట్ టైమ్)

11. పీర్ ఎడ్యుకేటర్ పోస్టులు

మొత్తం ఖాళీలు : 09 పోస్టులు

విద్య అర్హతలు :

1. పోస్టును బట్టి 10వ తరగతి, డిగ్రీ, సంబంధిత విభాగంలో అనుభవం లేదా ప్రత్యేక అర్హతలు ఉండాలి.

2. చౌకీదార్ మరియు హౌస్ కీపింగ్ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

వయో పరిమితి :

01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయో సడలింపులు:

1. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు

2. మాజీ సైనికులకు 3 సంవత్సరాలు

3. దివ్యాంగులకు 10 సంవత్సరాలు

4. గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము :

1. OC అభ్యర్థులు : రూ.500/-

2. SC, ST, BC మరియు దివ్యాంగ అభ్యర్థులు : రూ.300/- ఫీజు చెల్లించాలి.

జీతం వివరాలు :

ఈ నియామకాలలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.17,500 నుంచి రూ.60,000 వరకు వేతనం చెల్లించనున్నారు.

ఎంపిక విధానం :

1. అభ్యర్థుల ఎంపికను విద్యార్హతలలో సాధించిన మెరిట్, రోస్టర్ నిబంధనలు మరియు అవసరమైన సందర్భంలో ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు.

2. ఎలాంటి రాత పరీక్ష ఉండదు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు కడప జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://kadapa.ap.gov.in నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. పూరించిన దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జతచేసి, 04 జూన్ 2026 నుంచి 10 జూన్ 2026 మధ్య ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటలలోపు కడప ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని అదనపు డీఎంఈ/సూపరింటెండెంట్ కార్యాలయంలో సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ : 04 జూన్ 2026

దరఖాస్తుల చివరి తేదీ : 10 జూన్ 2026

Notification Pdf & Application Click Here

Office Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *