Central Govt Jobs

గ్రామ/వార్డు సచివాలయ స్థాయి జీతంతో జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు – NIMHANS నోటిఫికేషన్ 2026 విడుదల…. వెంటనే ఇలా అప్లై చేసుకోండి!

calendar_month June 12, 2026 person chitra

గ్రామ/వార్డు సచివాలయ స్థాయి జీతంతో జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు – NIMHANS నోటిఫికేషన్ 2026 విడుదల…. వెంటనే ఇలా అప్లై చేసుకోండి!

Latest NIMHANS Junior Secretarial Assistant Notification 2026 :

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (NIMHANS) నుంచి శుభవార్త అందింది. తాజాగా న్యూరోఅనస్థీసియా టెక్నాలజిస్ట్, అకౌంటెంట్ మరియు జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ లేదా సంబంధిత విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 08 జూన్ 2026 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 07 జూలై 2026 సాయంత్రం 4:30 గంటలలోపు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (NIMHANS) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. న్యూరోఅనస్థీసియా టెక్నాలజిస్ట్

2. అకౌంటెంట్

3. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్

విద్యార్హతలు :

న్యూరోఅనస్థీసియా టెక్నాలజిస్ట్ :

1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అనస్థీషియా టెక్నాలజీలో B.Sc పూర్తి చేసి ఉండాలి.

2. ప్రధాన ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

అకౌంటెంట్ :

1. కామర్స్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ.

2. కంప్యూటర్ అప్లికేషన్స్, ట్యాలీ, VAT తదితర అంశాల్లో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ :

1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

2. కంప్యూటర్ కోర్సులో 6 నెలల శిక్షణ ఉండాలి.

3. ఇంగ్లీష్ టైపింగ్ నిమిషానికి 35 పదాలు లేదా హిందీ టైపింగ్ నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి.

వయోపరిమితి :

1. 07 జూలై 2026 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు మించరాదు.

రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు కల్పించబడుతుంది.

దరఖాస్తు రుసుము :

గ్రూప్-B పోస్టులకు :

1. OC/OBC/EWS అభ్యర్థులు : రూ.1,180/-

2. SC/ST అభ్యర్థులు : రూ.885/-

గ్రూప్-C పోస్టులకు :

1. OC/OBC/EWS అభ్యర్థులు : రూ.885/-

2. SC/ST అభ్యర్థులు : రూ.590/-

3. PwBD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు ఉంది.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900/- నుంచి రూ.1,12,400/- వరకు వేతనం అందించబడుతుంది.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది.

1. MCQ ఆధారిత రాత పరీక్ష

2. నైపుణ్య పరీక్ష మరియు/లేదా పత్రాల ధృవీకరణ

3. తుది ఎంపికను NIMHANS సంస్థ నిర్వహిస్తుంది.

దరఖాస్తు విధానం :

1. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలతో కలిసి కింది చిరునామాకు ఆఫ్‌లైన్ విధానంలో పంపించాలి.

చిరునామా :

ది డైరెక్టర్,
NIMHANS,
పోస్ట్ బాక్స్ నెం. 2900,
హోసూర్ రోడ్,
బెంగళూరు – 560029

2. దరఖాస్తులు 07 జూలై 2026 సాయంత్రం 4:30 గంటలలోపు చేరేలా పంపించాలి.

3. ఒకసారి సమర్పించిన దరఖాస్తులో మార్పులు లేదా సవరణలు అనుమతించబడవు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ : 08 జూన్ 2026

దరఖాస్తుల చివరి తేదీ : 07 జులై 2026

Notification Pdf Click Here

Official Website Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *