DSSSB Recruitment 2026: 1,979 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. 12వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ అర్హతలతో అవకాశం….వెంటనే అప్లై చేసుకోండి.
DSSSB Recruitment 2026: 1,979 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. 12వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ అర్హతలతో అవకాశం….వెంటనే అప్లై చేసుకోండి.
DSSSB Recruitment 2026:
ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 03/2026 ద్వారా మొత్తం 1,979 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో TGT కంప్యూటర్ సైన్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, IT అసిస్టెంట్ గ్రేడ్-Aతో పాటు పలు టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Delhi Subordinate Services Selection Board (DSSSB) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : TGT, Special Educator, JSA, IT Assistant & Others
1. TGT (Computer Science)
2. Special Educator / TGT Special Education
3. IT Assistant Grade-A
4. Junior Scientific Assistant
5. ఇతర పోస్టులు
మొత్తం పోస్టులు : 1,979
ఉద్యోగాల విభాగాలు : బోధన, సైన్స్, టెక్నికల్
ఉద్యోగ స్థలం : ఢిల్లీ
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
విద్య అర్హతలు :
TGT (Computer Science) :
1. BCA లేదా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ
2. BE/B.Tech (CS/IT)
3. DOEACC ‘A’ లెవల్ అర్హత
Special Educator / TGT Special Education :
1. స్పెషల్ ఎడ్యుకేషన్‌లో సంబంధిత అర్హత
2. CTET అర్హత
3. RCI రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
IT Assistant Grade-A :
1. ఇంటర్ (12వ తరగతి) ఉత్తీర్ణత.
2. గంటకు 8,000 కీ డిప్రెషన్స్ టైపింగ్ స్పీడ్
Junior Scientific Assistant :
1. జూలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ తదితర సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ
ఇతర పోస్టులు :
సంబంధిత ట్రేడ్‌లో ITI, డిప్లొమా అర్హతలు లేదా అనుభవం కలిగిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
వయోపరిమితి :
1. చాలా పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా, గరిష్ట వయస్సు 27 లేదా 30 సంవత్సరాలుగా నిర్ణయించారు.
2. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు కల్పించబడుతుంది.
3. వయస్సు లెక్కింపు కోసం జూలై 15, 2026ను కట్-ఆఫ్ తేదీగా పరిగణిస్తారు.
జీతం వివరాలు :
1. పోస్టును బట్టి ఆకర్షణీయమైన వేతనాలు అందించనున్నారు.
2. Pay Level-7 (TGT పోస్టులు): ₹44,900 – ₹1,42,400
3. Pay Level-6: ₹35,400 – ₹1,12,400
4. Pay Level-5: ₹29,200 – ₹92,300
5. Pay Level-2 మరియు Level-4 పోస్టులు: ₹19,900 నుంచి ప్రారంభం
6. ప్రాథమిక వేతనంతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, వైద్య సదుపాయాలు, పెన్షన్ వంటి పలు అదనపు ప్రయోజనాలు కూడా ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయి.
ఎంపిక విధానం :
1. DSSSB రిక్రూట్‌మెంట్ 2026లో అభ్యర్థుల ఎంపిక పోస్టును బట్టి వివిధ దశల ద్వారా నిర్వహించబడుతుంది.
2. ప్రధానంగా వన్ టైర్ లేదా టూ టైర్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ (వర్తించే పోస్టులకు), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
3. ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు సంబంధిత పోస్టు కోడ్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి
దరఖాస్తు విధానం :
1. DSSSB అధికారిక వెబ్‌సైట్ https://dsssbonline.nic.in ను సందర్శించాలి.
2. కొత్త అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
3. లాగిన్ అయిన తర్వాత Advertisement No. 03/2026ను ఎంపిక చేయాలి.
4. సంబంధిత పోస్టు కోడ్‌ను ఎంచుకుని అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి.
5. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు నమోదు చేసి ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
6. అవసరమైన అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
7. దరఖాస్తును సమర్పించి ప్రింట్ కాపీని భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ : జూన్ 16, 2026
దరఖాస్తు చివరి తేదీ : జూలై 15, 2026
Official Notification PDF : Click Here
Online Application Portal : Click Here
Official Website : Click Here