Central Govt Jobs

10+2 అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. అగ్నివీర్వాయు రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month June 19, 2026 person chitra

10+2 అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. అగ్నివీర్వాయు రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి.

Indian Air Force Agniveervayu Recruitment 2026:

భారతీయ వాయుసేన (Indian Air Force-IAF) అగ్నిపథ్ పథకం కింద Agniveervayu Intake 02/2027 నియామకాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత భారతీయ పురుషులు, మహిళల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్ (10+2), డిప్లొమా లేదా సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 జూలై 6 ఉదయం 11 గంటలకు ప్రారంభమై, జూలై 26 రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,000 నుంచి రూ.40,000 వరకు వేతనం లభిస్తుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేపడతారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో ఉద్యోగాలు

పోస్టు పేరు : అగ్నివీర్వాయు (Agniveervayu Intake 02/2027) పోస్టులు

ఉద్యోగ విధానం : అగ్నిపథ్ పథకం

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్

విద్య అర్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

సైన్స్ స్ట్రీమ్ అభ్యర్థులకు :

గణితం, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10+2 లేదా సమాన పరీక్షలో మొత్తం కనీసం 50% మార్కులు, ఇంగ్లీష్‌లో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

లేదా

గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాల నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సును మొత్తం కనీసం 50 శాతం మార్కులతో పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

ఇతర స్ట్రీమ్ అభ్యర్థులకు :

ఏదైనా విభాగంలో ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన అర్హత పరీక్షలో మొత్తం కనీసం 50 శాతం మార్కులతో పాటు ఇంగ్లీష్ సబ్జెక్టులో కూడా కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

లేదా

రెండు సంవత్సరాల వృత్తి విద్యా కోర్సును కనీసం 50% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి :

1. 01 జూలై 2005 నుంచి 01 జనవరి 2010 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

2. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే సమయానికి గరిష్ట వయస్సు 22 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము :

1. పరీక్ష ఫీజు : రూ.550/-

2. అదనంగా 18 శాతం GST వర్తిస్తుంది.

3. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా UPI ద్వారా చెల్లించవచ్చు.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,000 నుంచి రూ.40,000 వరకు జీతం అందుతుంది.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది.

1. ఆన్‌లైన్ రాత పరీక్ష

2. దశ-2 పరీక్ష

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. శారీరక పరీక్ష

5. మెడికల్ ఎగ్జామినేషన్

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

2. కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

3. అవసరమైన వివరాలను నమోదు చేసి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.

4. ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి.

5. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 06 జూలై 2026

దరఖాస్తులకు చివరి తేదీ : 26 జూలై 2026

Notification Pdf Click Here

Online Apply Link Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *