AP DMHO Recruitment 2026: ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10+2 అర్హతతో ఏపీలో ల్యాబ్ అసిస్టెంట్, అటెండెంట్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.
AP DMHO Recruitment 2026: ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10+2 అర్హతతో ఏపీలో ల్యాబ్ అసిస్టెంట్, అటెండెంట్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.
AP DMHO Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అనంతపురం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DMHO) కార్యాలయం డేటా మేనేజర్, ల్యాబ్ అసిస్టెంట్/అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో చేపడుతున్నారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలోని ఆరోగ్య సంస్థల్లో ఖాళీగా ఉన్న డేటా మేనేజర్, ల్యాబ్ అసిస్టెంట్/అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ల్యాబ్ అసిస్టెంట్/అటెండెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ (10+2) లేదా సంబంధిత వృత్తి విద్య అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డేటా మేనేజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు నిర్దేశిత అనుభవం ఉండటం తప్పనిసరి.
ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, అనుభవానికి వెయిటేజ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15,000 నుంచి రూ.36,225 వరకు వేతనం అందించనున్నారు.
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి అవసరమైన ధ్రువపత్రాల ప్రతులతో కలిసి ఆఫ్‌లైన్ విధానంలో సమర్పించాలి. దరఖాస్తు ఫారాలు 2026 జూన్ 20 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండగా, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 2026 జూన్ 30 సాయంత్రం 5:30 గంటల లోపు అప్లై చేసుకోండి.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : AP ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. డేటా మేనేజర్
2. ల్యాబ్ అసిస్టెంట్/అటెండెంట్ పోస్టులు
విద్యార్హతలు :
డేటా మేనేజర్ :
1. సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉండాలి.
2. కంప్యూటర్ సైన్స్‌లో నిర్దేశిత అర్హతతో పాటు కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
3. ఐటీ/ఎలక్ట్రానిక్స్‌లో బీఈ చేసిన వారికి, ఆరోగ్య లేదా సామాజిక రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
ల్యాబ్ అసిస్టెంట్/అటెండెంట్ :
ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణతతో పాటు ల్యాబ్ అసిస్టెంట్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి లేదా ల్యాబ్ అటెండెంట్ శిక్షణ పొందిన వారు అర్హులు.

వయోపరిమితి :
2026 జూన్ 1 నాటికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
మాజీ సైనికులకు – సేవా కాలానికి అదనంగా 3 సంవత్సరాలు
వికలాంగులకు – 10 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము :
1. ఓసీ, బీసీ అభ్యర్థులకు – రూ.400/-
2. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు – రూ.200/-
3. దివ్యాంగులకు – ఫీజు మినహాయింపు.
జీతం వివరాలు :
1. డేటా మేనేజర్ – రూ.36,225/-
2. ల్యాబ్ అసిస్టెంట్/అటెండెంట్ – రూ.15,000/- నెలకి జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
1. రాత పరీక్ష ఉండదు.
2. విద్యార్హతల్లో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజ్, సంబంధిత అనుభవానికి గరిష్టంగా 10 మార్కులు కేటాయించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని అవసరమైన ధ్రువపత్రాల ప్రతులు, డిమాండ్ డ్రాఫ్ట్‌తో పాటు DMHO కార్యాలయానికి ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించాలి.
2. దరఖాస్తుతో పాటు చెక్‌లిస్ట్ రెండు కాపీలు జత చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 20 జూన్ 2026
దరఖాస్తుల చివరి తేదీ: 30 జూన్ 2026
Notification & Application Pdf Click Here
Official Website Click Here