IISER Jobs 2025: తిరుపతి లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ & జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ నోటిఫికేషన్ విడుదల… ఇలా అప్లై చేసుకోండి. | IISER Tirupati Non-Teaching Notification 2025:

IISER Jobs 2025: తిరుపతి లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ & జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ నోటిఫికేషన్ విడుదల… ఇలా అప్లై చేసుకోండి. | IISER Tirupati Non-Teaching Notification 2025:

Apply Now for the 2025 IISER Tirupati Non-Teaching Notification:

తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థ Indian Institute of Science Education and Research (IISER Tirupati) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి 2025 సంవత్సరానికి గాను కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో మంచి జీతభత్యాలు, ఉద్యోగ భద్రత లభిస్తుంది. కావున అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 24 ఉన్నాయి.

ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ (సివిల్), మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ , నర్స్, ప్రైవేట్ సెక్రటరీ,సుపీరియెంటెంట్, టెక్నికల్ అసిస్టెంట్,(IT ) టెక్నికల్ అసిస్టెంట్ (బయాలజీ ) , జూనియర్ లైబ్రరీ సుపీరియెంటెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ (రాజ్ భాష ), జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ( మల్టీ స్కిల్) అండ్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ దరఖాస్తులను ఆన్లైన్ లో https://www.iisertirupati.ac.in/ ద్వారా 02 ఫిబ్రవరి 2026 లోపు అప్లై చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

IISER Tirupati Jobs 2025 – నోటిఫికేషన్ వివరాలు:

సంస్థ పేరు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( IISER Tirupati ) లో ఉద్యోగాలు .

పోస్టుల వివరాలు:

IISER Tirupati విడుదల చేసిన Non-Teaching Notification 2025 ద్వారా పలు విభాగాలలో వివిధ రకాల నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ (సివిల్):
ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు భవనాల నిర్మాణ పనులు, మౌలిక వసతుల నిర్వహణ, కాంట్రాక్టర్ల పర్యవేక్షణ, సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన సాంకేతిక పనులు నిర్వహించాలి.

మెడికల్ ఆఫీసర్ (Medical Officer):
సంస్థలోని ఉద్యోగులు మరియు విద్యార్థులకు వైద్య సేవలు అందించడం, ప్రాథమిక చికిత్స, ఆరోగ్య నివేదికల నిర్వహణ వంటి బాధ్యతలు ఈ పోస్టులో ఉంటాయి.

అసిస్టెంట్ రిజిస్ట్రార్ (Assistant Registrar):
పరిపాలనా వ్యవహారాలు, అకడమిక్ రికార్డుల నిర్వహణ, ఉద్యోగుల సేవా వ్యవహారాలు మరియు పాలసీ అమలు వంటి కీలక బాధ్యతలు ఈ పోస్టుకు చెందుతాయి.

నర్స్ (Nurse):
వైద్య అధికారికి సహకరించడం, రోగుల సంరక్షణ, మెడికల్ రికార్డుల నిర్వహణ వంటి పనులు ఈ పోస్టులో ఉంటాయి.

ప్రైవేట్ సెక్రటరీ (Private Secretary):
ఉన్నతాధికారులకు సంబంధించిన గోప్యమైన లేఖల తయారీ, షెడ్యూల్ నిర్వహణ, వంటి పనులు నిర్వహించాలి.

సుపీరియెంటెంట్ (Superintendent):
కార్యాలయ పరిపాలనా విభాగంలో కీలక పాత్ర పోషిస్తూ సిబ్బంది పర్యవేక్షణ, ఫైల్ ప్రాసెసింగ్, ప్రభుత్వ నిబంధనల అమలు వంటి బాధ్యతలు ఉంటాయి.

టెక్నికల్ అసిస్టెంట్ (IT):
కంప్యూటర్ నెట్‌వర్క్, సిస్టమ్ మెయింటెనెన్స్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్, డేటా భద్రత వంటి సాంకేతిక పనులు నిర్వహించాలి.

టెక్నికల్ అసిస్టెంట్ (బయాలజీ):
బయాలజీ ల్యాబ్‌లలో ప్రయోగాల నిర్వహణ, పరికరాల సంరక్షణ, అధ్యాపకులకు సాంకేతిక సహాయం అందించడం ఈ పోస్టుకు సంబంధించినవి.

జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ (Junior Library Superintendent):
లైబ్రరీ పుస్తకాలు, డిజిటల్ వనరుల నిర్వహణ, విద్యార్థులకు అవసరమైన లైబ్రరీ సేవల అందజేత ఈ పోస్టులో భాగం.

జూనియర్ ట్రాన్స్లేటర్ (రాజ్ భాష):
హిందీ – ఇంగ్లీష్ – తెలుగు అనువాద పనులు, అధికారిక పత్రాల అనువాదం, రాజ్ భాష అమలుకు సంబంధించిన బాధ్యతలు నిర్వహించాలి.

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్):
కార్యాలయ సహాయక పనులు, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ఆపరేషన్, ఫైళ్ల నిర్వహణ వంటి బహుళ పనులు చేయాలి.

ల్యాబ్ అసిస్టెంట్ (Lab Assistant):
ప్రయోగశాల పరికరాల నిర్వహణ, ల్యాబ్ శుభ్రత, ప్రయోగాల సమయంలో అధ్యాపకులకు సహకారం అందించడం వంటి పనులు నిర్వహించాలి.

మొత్తం పోస్టులు: 24

వయస్సు:

IISER తిరుపతి నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం వయస్సు పరిమితి పోస్టుల ప్రకారం కింద ఇవ్వబడింది

కనీస వయస్సు: 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 30 నుండి 40 సంవత్సరాలు వరకు ఉంటుంది, పోస్ట్ ఆధారంగా మారవచ్చు.

వయస్సు సడలింపులు (Relaxation) :

1. SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

2. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు

3. PwBD (దివ్యాంగుల) అభ్యర్థులకు 10 సంవత్సరాలు ,కేంద్ర ప్రభుత్వ సేవలో ఉన్న అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.

విద్య అర్హతలు:

IISER తిరుపతి నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం పోస్టుల వారీగా అర్హతలు క్రింది విధంగా ఉన్నాయి:

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ (సివిల్):

సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ

సంబంధిత రంగంలో అనుభవం ఉండటం మేలు

మెడికల్ ఆఫీసర్:

ఏ గుర్తింపు పొందిన వైద్య విద్యాసంస్థ నుండి MBBS / MD డిగ్రీ

సంబంధిత వైద్య అనుభవం ఉంటే అదనపు అవకాశాలు.

అసిస్టెంట్ రిజిస్ట్రార్:

సంబంధిత రంగంలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ

ప్రభుత్వ సేవలో అనుభవం ఉండటం కావాలి.

నర్స్:

నర్సింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ (GNM / B.Sc Nursing)

సంబంధిత అనుభవం ఉండటం అవసరం.

ప్రైవేట్ సెక్రటరీ:

ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ, కంప్యూటర్ నైపుణ్యం (MS Office, Typing) ఉండాలి

సుపీరియెంటెంట్:

బ్యాచిలర్స్ డిగ్రీ

పరిపాలనా రంగంలో అనుభవం ఉండటం ప్రాధాన్యం

టెక్నికల్ అసిస్టెంట్ (IT):

కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ సంబంధిత డిప్లొమా / డిగ్రీ

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరిజ్ఞానం అవసరం

టెక్నికల్ అసిస్టెంట్ (బయాలజీ):

బయాలజీ సబ్జెక్టులో డిగ్రీ లేదా డిప్లొమా

జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్:

లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ / డిప్లొమా

లైబ్రరీ నిర్వహణలో అనుభవం కావాలి

జూనియర్ ట్రాన్స్లేటర్ (రాజ్ భాష):

హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషలపై మంచి పరిజ్ఞానం

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్):

ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ

కంప్యూటర్ ఆపరేషన్, టైపింగ్ పరిజ్ఞానం తప్పనిసరి

ల్యాబ్ అసిస్టెంట్:

సైన్స్ సబ్జెక్టులలో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా

జీతం వివరాలు:

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ (సివిల్)-₹44,900 – ₹1,42,400
మెడికల్ ఆఫీసర్-₹56,100 – ₹1,77,500
అసిస్టెంట్ రిజిస్ట్రార్ -₹44,900 – ₹1,42,400
నర్స్-₹29,200 – ₹92,300
ప్రైవేట్ సెక్రటరీ-₹35,400 – ₹1,12,400
సుపీరియెంటెంట్-₹35,400 – ₹1,12,400
టెక్నికల్ అసిస్టెంట్ (IT)-₹29,200 – ₹92,300
టెక్నికల్ అసిస్టెంట్ (బయాలజీ)- ₹29,200 – ₹92,300
జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్- ₹25,500 – ₹81,100
జూనియర్ ట్రాన్స్లేటర్ (రాజ్ భాష)- ₹25,500 – ₹81,100
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్) – ₹19,900 – ₹63,200
ల్యాబ్ అసిస్టెంట్ – ₹ ₹18,000 – ₹56,900

దరఖాస్తు రుసుము:

IISER తిరుపతి నాన్-టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

జనరల్ (UR) / OBC / EWS అభ్యర్థులు ₹1,000/- (సాధారణంగా)

SC / ST / PwBD (దివ్యాంగులు) / మహిళా అభ్యర్థులు ఫీజు మినహాయింపు (No Application Fee)

దరఖాస్తు రుసుమును ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.

ఎంపిక విధానం:

IISER తిరుపతి నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అభ్యర్థులను పోస్ట్‌ను బట్టి వేర్వేరు దశల ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక పూర్తిగా మెరిట్ మరియు అర్హత ఆధారంగా జరుగుతుంది. ఎంపిక విధానం క్రింది విధంగా ఉంటుంది:

1. రాత పరీక్ష (Written Test):

ఎక్కువ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో

జనరల్ నాలెడ్జ్

రీజనింగ్

ఇంగ్లీష్ / రాజ్ భాష (అనువాద పోస్టులకు)

సంబంధిత టెక్నికల్ సబ్జెక్ట్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

2. స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ :

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్), ప్రైవేట్ సెక్రటరీ, టెక్నికల్ అసిస్టెంట్ వంటి పోస్టులకు కంప్యూటర్ స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు.

3. ఇంటర్వ్యూ (Interview):

అసిస్టెంట్ రిజిస్ట్రార్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ (సివిల్) వంటి ఉన్నత స్థాయి పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది.

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification):

ఎంపికైన అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లు, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, కేటగిరీ సర్టిఫికెట్లు పరిశీలిస్తారు.

5. మెడికల్ పరీక్ష (Medical Examination):

తుది ఎంపికకు ముందు అభ్యర్థులు వైద్య పరీక్షకు హాజరుకావాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

IISER తిరుపతి నాన్-టీచింగ్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులకు దరఖాస్తు ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది:

1. ముందుగా IISER Tirupati అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

2. హోమ్ పేజీలో “Non-Teaching Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేయాలి.

3. విడుదలైన నోటిఫికేషన్ PDF‌ను పూర్తిగా చదివి అర్హతలు నిర్ధారించుకోవాలి.

4. అనంతరం Online Application Form లింక్‌పై క్లిక్ చేయాలి.

5. అభ్యర్థి వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, సంప్రదింపు వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.

6. ఫోటో, సంతకం, సర్టిఫికెట్లు వంటి అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

7. వర్తించే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి.

8. అన్ని వివరాలు సరిచూసిన తరువాత Submit బటన్‌పై క్లిక్ చేయాలి.

9. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత Print Out తీసుకొని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 డిసెంబర్ 2025

దరఖాస్తు చివరి తేదీ: 02 ఫిబ్రవరి 2026.

Notification pdf : Click Here

Official Website : Click Here

Apply Link : Click Here

Leave a Comment