Govt. Schemes

LPG Gas e-KYC పూర్తి చేయకపోతే గ్యాస్ కనెక్షన్ నిలిపివేత.. మొబైల్ ద్వారానే ఇంటి వద్ద నుంచి సులభంగా ఇలా పూర్తి చేసుకోండి.

calendar_month June 23, 2026 person chitra

LPG Gas e-KYC పూర్తి చేయకపోతే గ్యాస్ కనెక్షన్ నిలిపివేత.. మొబైల్ ద్వారానే ఇంటి వద్ద నుంచి సులభంగా ఇలా పూర్తి చేసుకోండి.

LPG Gas e-KYC Registration Process :

దేశవ్యాప్తంగా LPG వంటగ్యాస్ వినియోగంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2023లో e-KYC విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ చాలా మంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో పౌర సరఫరాల శాఖ జూన్ 30లోపు e-KYC తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించింది.

వినియోగదారులు తమకు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ లేదా డీలర్ వద్ద e-KYC చేయించుకోవచ్చు. అలాగే గ్యాస్ కంపెనీలు అందుబాటులో ఉంచిన అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారా ఇంటి వద్ద నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం కల్పించాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

e-KYCలో భాగంగా గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు ముఖ గుర్తింపు (Face Authentication), వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ ద్వారా ధృవీకరణ జరుగుతుంది. ఈ ప్రక్రియను నిర్వహించే సమయంలో నకిలీ వెబ్‌సైట్లు, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక యాప్‌లు లేదా గ్యాస్ ఏజెన్సీల ద్వారా మాత్రమే e-KYC పూర్తి చేయడం సురక్షితం.

HP Gas వినియోగదారులు ఇలా చేయాలి..?

HP Gas కస్టమర్లు ముందుగా ప్లే స్టోర్ నుంచి HP Pay మరియు AadhaarFaceRD యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం మొబైల్ నంబర్‌తో OTP ధృవీకరణ చేసి లాగిన్ అవ్వాలి.

యాప్‌లోని ‘My HP Connection’ విభాగానికి వెళ్లి, అక్కడ కనిపించే LPG ఎంపికను ఎంచుకున్న తర్వాత e-KYC ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించి Face Capture ద్వారా ముఖ గుర్తింపు పూర్తిచేస్తే e-KYC ప్రక్రియ విజయవంతమవుతుంది.

Bharat Gas వినియోగదారులకు విధానం :

Bharat Gas కస్టమర్లు ప్లే స్టోర్ నుంచి Hello BPCL మరియు AadhaarFaceRD యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత హోమ్ పేజీలో కనిపించే e-KYC ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మరోసారి OTP ధృవీకరణ అనంతరం స్క్రీన్‌పై చూపించే సూచనలను అనుసరిస్తూ Face Authentication పూర్తి చేస్తే e-KYC నమోదు పూర్తవుతుంది.

Indane Gas వినియోగదారులు ఇలా చేయాలి ..

Indane Gas కస్టమర్లు IndianOil ONE మరియు AadhaarFaceRD యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్‌తో లాగిన్ అయిన అనంతరం, యాప్‌ను తొలిసారిగా ఉపయోగిస్తున్న వినియోగదారులు ముందుగా పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించిన 16 అంకెల LPG ID లేదా Subscription Number వివరాలను నమోదు చేసిన తర్వాత కస్టమర్ వివరాలు కనిపిస్తాయి. అనంతరం హోమ్ పేజీలో e-KYC Status విభాగంలోకి వెళ్లి Face Authentication ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయాలి.

జూన్ 30లోపు తప్పనిసరిగా పూర్తి చేయండి :

పై విధంగా అధికారిక యాప్‌ల ద్వారా లేదా మీ సమీప గ్యాస్ డీలర్, గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి LPG e-KYC ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఈ నెలాఖరుతో e-KYC గడువు ముగియనున్నందున, వినియోగదారులు ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *