telangana jobs

Telangana Anganwadi Notification 2026: రాత పరీక్ష లేకుండా అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. 10th, ఇంటర్ అర్హతతో అవకాశం!

calendar_month July 2, 2026 person chitra

Telangana Anganwadi Notification 2026: రాత పరీక్ష లేకుండా అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. 10th, ఇంటర్ అర్హతతో అవకాశం!

Telangana Anganwadi AWT/AWH Recruitment 2026:

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 అంగన్వాడీ టీచర్ (AWT), అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్, నల్గొండ జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల కాగా, తాజాగా ములుగు జిల్లా పరిధిలో మరో నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా తాడ్వాయి మరియు వెంకటాపురం ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 31 అంగన్వాడీ టీచర్ (AWT), 85 అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాల్లో రాత పరీక్ష ఉండదు. విద్యార్హత, మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేపడతారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : తెలంగాణ లో అంగన్వాడీ ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. అంగన్వాడీ టీచర్ (AWT),

2. అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టులు

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీల వివరాలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మల్టీజోన్–1 :

అంగన్వాడీ టీచర్ పోస్టులు: 1,853
అంగన్వాడీ హెల్పర్ పోస్టులు: 7,737

మల్టీజోన్–2:

అంగన్వాడీ టీచర్ పోస్టులు: 1,247
అంగన్వాడీ హెల్పర్ పోస్టులు: 5,145

ములుగు జిల్లా ఖాళీలు:

అంగన్వాడీ టీచర్ (AWT): 31 పోస్టులు
అంగన్వాడీ హెల్పర్ (AWH): 85 పోస్టులు

విద్యార్హతలు :

అంగన్వాడీ టీచర్ (AWT) :

తప్పనిసరిగా ఇంటర్మీడియట్ / 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

అంగన్వాడీ హెల్పర్ (AWH) :

గిరిజన ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పరిస్థితిలో 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులైన అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

వయోపరిమితి :

01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్థానికత :

అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధిలోని గ్రామపంచాయతీ లేదా పట్టణ ప్రాంతంలో సంబంధిత వార్డుకు చెందిన స్థానిక మహిళ అయి ఉండాలి.

ఎంపిక విధానం :

ఈ నియామకాల్లో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది.

ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ – 70 మార్కులు

వితంతువులకు – 5 మార్కులు

అనాథలకు – 10 మార్కులు

దివ్యాంగులకు – 5 మార్కులు

జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ – 10 మార్కులు

రిజర్వేషన్ నిబంధనలు :

1. అంగన్వాడీ టీచర్ (AWT), అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టులకు సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధికి చెందిన స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

2. ఎస్టీ సబ్‌ప్లాన్ పోస్టులకు సంబంధిత గ్రామం లేదా హాబిటేషన్‌కు చెందిన ఎస్టీ మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

3. ఎస్సీ సబ్‌ప్లాన్ పోస్టులకు సంబంధిత గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్, పోస్టుల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం మరియు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించి, నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01 July 2026

దరఖాస్తుల చివరి తేదీ: 15 July 2026

ముఖ్య గమనిక :

పరిపాలనా కారణాల రీత్యా ఈ నోటిఫికేషన్‌లో మార్పులు, సవరణలు చేయడం, వాయిదా వేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం వంటి పూర్తి అధికారాలు జిల్లా కలెక్టర్/జిల్లా ఎంపిక కమిటీ చైర్మన్‌కు ఉంటాయి. CDPO, DWO కార్యాలయాలు లేదా ప్రజావాణి ద్వారా సమర్పించిన దరఖాస్తులు ఏ పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబడవు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించాలి.

Notification Pdf Click Here

 Vacancies and Roster List Click Here

Official Website Click Here

Apply Online Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *