AP Jobs

AP DCHSలో రాత పరీక్ష లేకుండా థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & GDA/MNO/FNO ఉద్యోగాల భర్తీ.. 10వ తరగతి అర్హతతో దరఖాస్తులకు అవకాశం.. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి!

calendar_month July 4, 2026 person chitra

AP DCHSలో రాత పరీక్ష లేకుండా థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & GDA/MNO/FNO ఉద్యోగాల భర్తీ.. 10వ తరగతి అర్హతతో దరఖాస్తులకు అవకాశం.. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి!

AP DCHS Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (DCHS) పరిధిలో థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ (GDA/MNO/FNO) తదితర అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో సాధించిన మెరిట్, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫారమ్ 01 జూలై 2026 ఉదయం 10:00 గంటల నుంచి 10 జూలై 2026 సాయంత్రం 5:00 గంటల వరకు జిల్లా అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. థియేటర్ అసిస్టెంట్

2. ల్యాబ్ అటెండెంట్

3. జనరల్ డ్యూటీ అటెండెంట్ (GDA/MNO/FNO) పోస్టులు ఉన్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం పోస్టులు : 06

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్

విద్యార్హతలు ;

థియేటర్ అసిస్టెంట్ :

గుర్తింపు పొందిన బోర్డు నుంచి SSC/10వ తరగతి లేదా సమాన అర్హత ఉత్తీర్ణత.

ల్యాబ్ అటెండెంట్ :

1. SSC/10వ తరగతి లేదా సమాన అర్హత.

2. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి నిర్వహించే ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్) లేదా ప్రభుత్వం గుర్తించిన సమాన అర్హత కలిగి ఉండాలి.

జనరల్ డ్యూటీ అటెండెంట్ (GDA/MNO/FNO) :

SSC/10వ తరగతి లేదా సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :

1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

2. వయస్సును 01 జూలై 2026 నాటికి పరిగణనలోకి తీసుకుంటారు.

3. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

1. OC అభ్యర్థులు: రూ.500/-

2. SC/ST/BC/EWS/PwBD అభ్యర్థులు: రూ.250/-

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.15,000/- వరకు నెలవారీ వేతనం చెల్లించబడుతుంది.

ఎంపిక విధానం :

1. ఈ నియామకాల్లో రాత పరీక్ష నిర్వహించరు.

2. అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ఆధారంగా ఉంటుంది.

విద్యార్హతలో సాధించిన మెరిట్

ధ్రువపత్రాల పరిశీలన

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి ?

దరఖాస్తు సమర్పించే విధానం పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన ధ్రువపత్రాల ప్రతులను జతచేసి, క్రింది అడ్రస్ కి పంపించాలి.

చిరునామా:

జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త కార్యాలయం,
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, మొదటి అంతస్తు,
విజయనగరంలోని నిర్దేశిత కౌంటర్‌లో 10 జూలై 2026 సాయంత్రం 5:00 గంటలలోపు స్వయంగా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01 జూలై 2026

దరఖాస్తుల చివరి తేదీ: 10 జూలై 2026

Vijayanagaram District Notification & Application Pdf Click Here

GunturDistrict Notification & Application Pdf Click Here

Tirupati District Notification & Application Pdf Click Here

 Palnadu District Notification & Application Pdf Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *