AP TET 2025 ఎగ్జామ్ ఫైనల్ కీ, ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ డేట్| AP TET Final Key Release Date:
AP TET 2025 Final Key – Official Update:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాలనుకునే అభ్యర్థులకు AP TET 2025 (ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఎంతో కీలకమైన పరీక్ష. ఈ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీ మరియు ఫైనల్ రిజల్ట్స్ కోసం లక్షల మంది అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన అధికారిక సమాచారం ప్రకారం, AP TET 2025 ఎగ్జామ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. పరీక్ష పూర్తైన తర్వాత విడుదలయ్యే AP TET 2025 Final Key ఆధారంగానే అభ్యర్థుల ఫైనల్ మార్కులు నిర్ణయించబడతాయి. అధికారికంగా ప్రకటించే AP TET 2025 Final Key లో ప్రశ్నలకు సరైన సమాధానాలు మాత్రమే ఉంటాయి కాబట్టి, అభ్యర్థులు తప్పనిసరిగా దీన్ని పరిశీలించాలి. అంతేకాదు, AP TET 2025 Final Key విడుదలైన కొద్ది రోజులకే ఫైనల్ రిజల్ట్స్ కూడా ప్రకటించే అవకాశం ఉంది.
అయితే AP TET 2025 Final Key 13 జనవరి 2026 విడుదల చేయనున్నారు. అలాగే ఫైనల్ ఫలితాలను 19 జనవరి 2026 విడుదల చేయనున్నట్లు విద్య శాఖ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
AP TET 2025 Final Key విడుదల తేదీ:
అభ్యర్థులు పంపిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత, AP TET 2025 ఫైనల్ కీ విడుదల చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం 13 జనవరి 2026 న విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలియజేసారు.
AP TET 2025 ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ డేట్:
ఫైనల్ కీ విడుదలైన కొన్ని రోజుల్లోనే AP TET 2025 ఫైనల్ రిజల్ట్స్ ప్రకటించనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం 19 జనవరి 2026 న రిలీజ్ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేసారు.
రిజల్ట్స్ ఆన్లైన్ విధానంలో విడుదల చేయబడతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
AP TET 2025 రిజల్ట్ ఎలా చెక్ చేయాలి?
AP TET ఫైనల్ రిజల్ట్ చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:
1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – aptet.apcfss.in లేదా tet2dsc.apcfss.in
2. “AP TET 2025 Results” లింక్‌పై క్లిక్ చేయండి.
3. హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.
4. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
5. మీ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
6. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.
AP TET 2025 క్వాలిఫై మార్కులు:
AP TET 2025లో క్వాలిఫై కావడానికి కేటగిరీ వారీగా కనీస మార్కులు అవసరం:
OC – 60%
BC – 50%
SC / ST / PwD – 40%
ఈ అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు TET సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది.
ఫైనల్ కీ విడుదలైన తర్వాత, AP TET 2025 ఫైనల్ కీ రిలీజ్ డేట్ & ఫైనల్ రిజల్ట్స్ ఆధారంగా అభ్యర్థుల అర్హతను నిర్ణయిస్తారు.