telangana jobs

TGPSC Jobs 2026: పట్టణ & గ్రామీణ ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం!

calendar_month July 7, 2026 person chitra

TGPSC Jobs 2026: పట్టణ & గ్రామీణ ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం!

TGPSC Assistant Director Recruitment 2026:

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక శాఖ (Town and Country Planning Department)లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు ప్రక్రియ 10 జూలై 2026 ఉదయం 11 గంటలకు ప్రారంభమై, 17 ఆగస్టు 2026 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : TS పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక శాఖ (Town and Country Planning Department)లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టులు

మొత్తం పోస్టులు : 10

విద్య అర్హతలు :

అభ్యర్థులు కింది అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి:

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

B.Arch (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్)

B.E./B.Tech (సివిల్)

B.Planning / B.Tech (Planning)

M.A. (Geography)

M.Sc. (Geography)

M.Sc. (Geoinformatics)

అదనంగా, కింది అర్హతల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి:

1. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా

2. Institute of Town Planners, India (ITPI) ఫెలోషిప్ లేదా అసోసియేట్‌షిప్

3. UGC గుర్తింపు పొందిన ప్లానింగ్ సంస్థల తత్సమాన సభ్యత్వం

వయోపరిమితి :

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు

2. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు మరియు ఇతర రిజర్వేషన్ వర్గాలకు వర్తించే వయో సడలింపులు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అమలు చేయబడతాయి.

దరఖాస్తు రుసుము :

1. OC & BC అభ్యర్థులకు : ₹1000 /-

2. SC / ST / PwD : ₹500 /-

పరీక్ష రుసుము:

₹120 (అన్ని అభ్యర్థులకు వర్తిస్తుంది).

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.58,850 నుండి రూ.1,37,050 వరకు వేతనం చెల్లించబడుతుంది.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపికను క్రింది దశల ఆధారంగా నిర్వహిస్తారు:

1. రాత పరీక్ష

2. స్కిల్ టెస్ట్ (అవసరమైతే)

3. ఇంటర్వ్యూ

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి?

1. అధికారిక TGPSC వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. Online Application లింక్‌పై క్లిక్ చేయండి.

3. మీ TGPSC ID మరియు పుట్టిన తేదీ నమోదు చేయండి.

4. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ద్వారా లాగిన్ అవ్వండి.

5. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

6. ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించండి.

7. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ కాపీని భద్రపరచుకోండి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 10 జూలై 2026

దరఖాస్తుల చివరి తేదీ : 17 ఆగస్టు 2026

Notification Pdf Click Here

Official Website Click Here

Apply Online Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *