telangana jobs

రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10వ తరగతి అర్హతతో దరఖాస్తు చేసుకునే అవకాశం!

calendar_month July 13, 2026 person chitra

రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10వ తరగతి అర్హతతో దరఖాస్తు చేసుకునే అవకాశం!

Ration Dealer Notification 2026:

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణం (రేషన్ షాప్) డీలర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 30 రేషన్ డీలర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

పోస్టుల వివరాలు : రేషన్ డీలర్ ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం పోస్టులు : 30

విద్య అర్హతలు :

1. అభ్యర్థి కనీసం 10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

2. ఒకవేళ 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, 7వ తరగతి ఉత్తీర్ణుల దరఖాస్తులను కూడా పరిశీలిస్తారు.

వయోపరిమితి :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

నోటిఫికేషన్ విడుదలైన తేదీ నాటికి అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసి, గరిష్టంగా 40 సంవత్సరాల లోపు ఉండాలి.

ఇతర అర్హతలు :

1. అభ్యర్థిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేదా నిత్యావసర వస్తువుల చట్టం (Essential Commodities Act) కింద నేర చరిత్ర ఉండకూడదు.

2. మంచి నడవడిక, గత చరిత్ర కలిగి ఉండాలి.

నివాస అర్హత :

1. దరఖాస్తు చేస్తున్న రేషన్ షాప్ ఉన్న గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధిలోనే నివాసం ఉండాలి.

2. వికలాంగ అభ్యర్థులు సంబంధిత మండలానికి చెందిన వారై ఉండాలి. ఎంపికైన తర్వాత సంబంధిత గ్రామంలో నివసించాల్సి ఉంటుంది.

3. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఎంపికలో ప్రాధాన్యత :

కింది వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.

1. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు

2. మహిళలతో మాత్రమే నడిచే స్వయం సహాయక సంఘాలు (SHGs)

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఈ నియామకాలకు కింది వారు అర్హులు: 

1. నిరుద్యోగ అభ్యర్థులు

2. మహిళా స్వచ్ఛంద వినియోగదారుల సంఘాలు

3. మహిళలు మాత్రమే నిర్వహించే గ్రామీణ లేదా పట్టణ స్వయం సహాయక సంఘాలు (SHGs)

దరఖాస్తులు ఎక్కడ సమర్పించాలి?

1. అభ్యర్థులు ప్రభుత్వ పని దినాల్లో రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (RDO) కార్యాలయం, చౌటుప్పల్లో నేరుగా దరఖాస్తులను సమర్పించాలి.

2. దరఖాస్తుల స్వీకరణ సమయం: ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 13 జూలై 2026

దరఖాస్తుల చివరి తేదీ: 27 జూలై 2026

Notification Pdf :  Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *