TIMS హైదరాబాద్లో 240 కాంట్రాక్ట్ ఉద్యోగాలు 2026 | మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం…వెంటనే అప్లై చేసుకోండి.
TIMS హైదరాబాద్లో 240 కాంట్రాక్ట్ ఉద్యోగాలు 2026 | మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం…వెంటనే అప్లై చేసుకోండి.
TIMS హైదరాబాద్లో 240 కాంట్రాక్ట్ ఉద్యోగాలు 2026:
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు మరో మంచి ఉద్యోగావకాశం లభించింది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS), సనత్నగర్, హైదరాబాద్ లో వివిధ విభాగాల్లో మొత్తం 240 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), తెలంగాణ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నియామకాలు కాంట్రాక్ట్ / హానరేరియం ప్రాతిపదికన నిర్వహించబడుతున్నాయి. ఎంపికైన అభ్యర్థులు 31 మార్చి 2027 వరకు లేదా రెగ్యులర్ నియామకాలు పూర్తయ్యే వరకు సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్య రంగంలో ఉద్యోగం పొందాలని ఆశిస్తున్న వారికి ఇది మంచి అవకాశం.
పోస్టుల వివరాలు – ఉద్యోగాల ముఖ్యాంశాలు :
సంస్థ పేరు : Director of Medical Education (DME), Telangana లో ఉద్యోగాలు
ఆసుపత్రి : TIMS, Sanathnagar, Hyderabad
పోస్టుల వివరాలు :
1. Medical Officer – 144
2. Pharmacist Grade-II – 14
3. Lab Technician Grade-II – 48
4. Lab Technician Grade-I – 12
5. Medico Social Worker Grade-II – 6
6. Junior Assistant – 16
మొత్తం పోస్టులు : 240
విద్య అర్హతలు :
ప్రతి పోస్టుకు ప్రత్యేక అర్హతలు నిర్ణయించారు. సంబంధిత కోర్సులో ఉత్తీర్ణతతో పాటు అవసరమైన కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
| పోస్టు | అర్హత |
|---|---|
| Medical Officer | MBBS + Telangana Medical Council Registration |
| Pharmacist Grade-II | ఇంటర్మీడియట్ + D.Pharmacy / B.Pharmacy + Telangana Pharmacy Council Registration |
| Lab Technician Grade-II | DMLT లేదా B.Sc (MLT) + TGPMB Registration |
| Lab Technician Grade-I | Lab Technician Grade-II అర్హత + 5 సంవత్సరాల అనుభవం |
| Medico Social Worker Grade-II | MSW + కనీసం 3 సంవత్సరాల అనుభవం |
| Junior Assistant | ఏదైనా డిగ్రీ + కంప్యూటర్ పరిజ్ఞానం |
వయో పరిమితి :
మెడికల్ ఆఫీసర్ పోస్టు మినహా ఇతర పోస్టులకు గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలుగా నిర్ణయించారు.
| వర్గం | వయోపరిమితి |
|---|---|
| సాధారణ అభ్యర్థులు | 45 సంవత్సరాలు |
| SC / ST | 5 సంవత్సరాల వయో సడలింపు |
| BC | 3 సంవత్సరాల వయో సడలింపు |
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర రిజర్వేషన్ సడలింపులు కూడా వర్తిస్తాయి.
జీతం వివరాలు :
పోస్టుల వారీగా జీతాలను ప్రత్యేకంగా వెల్లడించలేదు. ఎంపికైన అభ్యర్థులకు G.O. Ms. No.49, Finance (HRM-VII) Department, తేదీ 21-05-2026 ప్రకారం నెలవారీ కన్సాలిడేటెడ్ వేతనం చెల్లిస్తారు. వర్తించే పన్నులు మరియు ఇతర మినహాయింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు అవుతాయి.
ఎంపిక విధానం :
ఈ నియామకాల్లో రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల విద్యార్హతలు మరియు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన అనుభవానికి వెయిటేజ్ మార్కులు కేటాయించి మెరిట్ జాబితా రూపొందిస్తారు.
| ప్రమాణం | వెయిటేజ్ |
|---|---|
| విద్యార్హత మార్కులు | 70% |
| ప్రభుత్వ అనుభవం | 30% |
ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేసిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం అదనపు వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
దరఖాస్తు విధానం :
ఈ నియామకాలకు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తు చేసే విధానం:
- అధికారిక నోటిఫికేషన్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి.
- అవసరమైన వివరాలను పూర్తిగా నింపండి.
- సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జత చేయండి.
- నిర్ణయించిన తేదీలోపు దరఖాస్తును Principal, Osmania Medical College, Hyderabad కార్యాలయంలో స్వయంగా సమర్పించాలి.
- చివరి తేదీ తర్వాత లేదా పోస్టు ద్వారా ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
అవసరమైన డాక్యుమెంట్లు :
దరఖాస్తు సమర్పించే సమయంలో ఈ క్రింది పత్రాల జిరాక్స్ కాపీలు మరియు ఒరిజినల్స్ వెంట తీసుకురావాలి.
1. దరఖాస్తు ఫారం
2.ఆధార్ కార్డు
3. PAN కార్డు
4. SSC / జనన ధృవీకరణ పత్రం
5. స్టడీ లేదా బోనాఫైడ్ సర్టిఫికెట్లు
6. సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు
7. కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు
8. అనుభవ ధృవీకరణ పత్రం (ఉంటే)
9. పాస్పోర్ట్ సైజు ఫోటోలు
ముఖ్యమైన తేదీలు:
| కార్యక్రమం | తేదీ |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల | 15-07-2026 |
| దరఖాస్తుల ప్రారంభం | 15-07-2026 |
| చివరి తేదీ | 22-07-2026 |
| స్క్రూటినీ | 23-07-2026 నుంచి 24-07-2026 |
| ప్రొవిజనల్ లిస్ట్ | 25-07-2026 |
| అభ్యంతరాల స్వీకరణ | 27-07-2026 |
| ఫైనల్ లిస్ట్ | 28-07-2026 |
| సర్టిఫికేట్ వెరిఫికేషన్ | 29-07-2026 |
| మెరిట్ లిస్ట్ | 30-07-2026 |
Notification & Application Form