AP KGBV లో పదవ తరగతి అర్హతతో 1095 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి. | AP KGBV Jobs Notification 2025
AP KGBV Jobs Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. Samagra Shiksha – AP ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBV) లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1095 టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా పదవ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులకు కూడా మంచి అవకాశాలు కల్పించారు. అంతే కాకుండా 10th /ఇంటర్ / డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను outsourcing విధానం లో భర్తీ చేస్తారు. ఈ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు వయస్సు 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
AP KGBV Jobs Notification 2025 – Overview:
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో ఉన్న KGBV పాఠశాలల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు పూర్తిగా ఔట్ సోర్సింగ్ విధానంలో ఉండగా, మహిళా అభ్యర్థులకే అవకాశం కల్పించబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలనుకునే మహిళలకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
సంస్థ పేరు : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBV) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : ఈ నోటిఫికేషన్ ద్వారా కింది ముఖ్యమైన పోస్టులు భర్తీ చేయనున్నారు.
1. Warden (వార్డెన్)
2. Computer Instructor (కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్)
3. Accountant (అకౌంటెంట్)
4. ANM (ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్)
5. Head Cook (హెడ్ కుక్)
6. Attender (అటెండర్)
7. Sweeper (స్వీపర్)
మొత్తం పోస్టులు : 1095
విద్య అర్హతలు:
పోస్టును బట్టి విద్యార్హత భిన్నంగా ఉంటుంది.
Attender, Sweeper: కనీస అర్హత 10వ తరగతి పాస్
Head Cook: 10వ తరగతి + వంట పనిలో అనుభవం
ANM: ANM కోర్సు పూర్తి చేసి సంబంధిత రిజిస్ట్రేషన్ ఉండాలి
Accountant: డిగ్రీ + అకౌంటింగ్ అనుభవం అవసరం
Computer Instructor: డిగ్రీ / డిప్లొమా + కంప్యూటర్ కోర్సు అర్హత
Warden: డిగ్రీ పూర్తి చేసి హాస్టల్ నిర్వహణ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వయో పరిమితి:
AP KGBV Jobs Notification 2025 ప్రకారం అభ్యర్థుల వయస్సు పరిమితి పోస్టులన్నింటికీ సాధారణంగా ఒకే విధంగా ఉంటుంది.
కనీస వయస్సు: 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయస్సులో సడలింపు:
ప్రభుత్వ నియమాల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది.
SC / ST అభ్యర్థులు: 5 సంవత్సరాలు
BC అభ్యర్థులు: 5 సంవత్సరాలు
PH (దివ్యాంగులు): 10 సంవత్సరాలు
Ex-Servicemen: ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు కి అప్లై చేసుకొనే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అవసరం లేదు.
శాలరీ వివరాలు:
పోస్టును బట్టి జీతం మారుతుంది. సాధారణంగా నెలకు ₹10,000 నుండి ₹40,000 వరకు వేతనం ఉంటుంది. Warden, Computer Instructor, Accountant వంటి పోస్టులకు ఎక్కువ వేతనం ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు. అభ్యర్థులను విద్యార్హత మెరిట్ + ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అనుభవం ఉన్నవారికి అదనపు ప్రాధాన్యం ఇస్తారు.
ఎలా అప్లై చేయాలి?
1. సంబంధిత జిల్లా APC (Additional Project Coordinator) కార్యాలయం నుండి అప్లికేషన్ ఫారం పొందాలి.
2. పూర్తి వివరాలతో ఫారం నింపాలి.
3. అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ జత చేయాలి.
4. చివరి తేదీలోపు APC కార్యాలయంలో సమర్పించాలి
అవసరమైన డాక్యుమెంట్లు:
1. 10వ తరగతి సర్టిఫికేట్
2. ఆధార్ కార్డు
3. నివాస ధ్రువీకరణ పత్రం
4. కుల ధ్రువీకరణ పత్రం (ఉంటే)
5. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
అప్లై విధానం: ఆఫ్ లైన్
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల డేట్: 02-జనవరి-2026 (Notification No.01/KGBV/APSS/2025)
అప్లికేషన్ ప్రారంభం: 03-జనవరి-2026
దరఖాస్తు చివరి తేదీ: 11-జనవరి-2026
ప్రొవిజనల్ లిస్ట్ విడుదల: 19-జనవరి-2026
ఇంటర్వ్యూ డేట్స్: 23-24 జనవరి-2026
ఫైనల్ లిస్ట్ & ఉద్యోగ ప్రాప్తి: 28-జనవరి-2026.
Notification pdf : Click Here
Official Website : Click Here