ISRO Recruitment 2026: సొంత రాష్ట్రంలోనే ఇస్రోలో 242 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో దరఖాస్తులు ప్రారంభం! వెంటనే అప్లై చేసుకోండి.
ISRO Recruitment 2026: సొంత రాష్ట్రంలోనే ఇస్రోలో 242 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో దరఖాస్తులు ప్రారంభం! వెంటనే అప్లై చేసుకోండి.
ISRO Recruitment 2026:
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO – Indian Space Research Organisation) నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి మొత్తం 242 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జూలై 27 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందేందుకు ఇది మంచి అవకాశం. ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ వేతనంతో పాటు పలు అలవెన్సులు కూడా లభిస్తాయి.
ISRO Recruitment 2026 – ముఖ్య వివరాలు :
సంస్థ పేరు :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO – Indian Space Research Organisation) లో ఉద్యోగాలు
పోస్టుల పేరు : అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ పోస్టులు
పోస్టుల వివరాలు :
అసిస్టెంట్ – 111 పోస్టులు
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (JPA) – 81 పోస్టులు
అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) – 22 పోస్టులు
స్టెనోగ్రాఫర్ – 27 పోస్టులు
మొత్తం ఖాళీలు : 242 పోస్టులు
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
విద్యార్హతలు :
పోస్టును బట్టి అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
అసిస్టెంట్ / UDC / JPA పోస్టులకు :
1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. కనీసం 60% మార్కులు లేదా 6.32 CGPA (10 పాయింట్ల స్కేల్) ఉండాలి.
స్టెనోగ్రాఫర్ పోస్టులకు :
1. గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి కమర్షియల్ / సెక్రటేరియల్ ప్రాక్టీస్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
2. కనీసం 60% మార్కులు లేదా 6.32 CGPA ఉండాలి.
3. స్టెనో-టైపిస్ట్ లేదా స్టెనోగ్రాఫర్‌గా ఒక సంవత్సరం అనుభవం అవసరం.
4. ఇంగ్లీష్ స్టెనోగ్రఫీలో నిమిషానికి 60 పదాల వేగం ఉండాలి.
5. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
గమనిక: DCP/DCCP అభ్యర్థులకు BOAT జారీ చేసిన అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్‌ను అనుభవంగా పరిగణిస్తారు.
వయోపరిమితి :
1. 16 ఆగస్టు 2026 నాటికి గరిష్ట వయస్సు – 28 సంవత్సరాలు
2. OBC అభ్యర్థులకు – 31 సంవత్సరాలు
3. SC/ST అభ్యర్థులకు – 33 సంవత్సరాలు
4. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము :
1. అన్ని పోస్టులకు దరఖాస్తు ఫీజు – రూ.100/-
2. అయితే ప్రతి అభ్యర్థి ప్రారంభంలో రూ.500 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
3. అర్హత ఉన్న వర్గాలకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఫీజు రీఫండ్ వర్తిస్తుంది.
నెల జీతం :
1. ఎంపికైన అభ్యర్థులను పే మ్యాట్రిక్స్ లెవల్–4లో నియమిస్తారు.
2. ప్రారంభ మూల వేతనం – రూ.25,500/-
3. అదనంగా
డియర్‌నెస్ అలవెన్స్ (DA)
హౌస్ రెంట్ అలవెన్స్ (HRA)
ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (TA)
ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు
ఎంపిక విధానం :
అభ్యర్థులను క్రింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్ (పోస్టును బట్టి)
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు విధానం :
1. ISRO అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. Recruitment విభాగంలో సంబంధిత నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయండి.
3. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయండి.
4. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.
5. దరఖాస్తు రుసుము చెల్లించండి.
6. చివరిగా ఫారమ్‌ను సమర్పించి ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 27 జూలై 2026
దరఖాస్తుల చివరి తేదీ: 16 ఆగస్టు 2026
Full Notification Click Here
Apply Link Click Here
Official Website Click Here