telangana jobs

ఫీజు , పరీక్ష లేకుండా ఇంటర్ అర్హతతో హైదరాబాద్‌లో 181 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేయండి! | Hyderabad District Anganwadi Teacher Notification 2026 :

calendar_month July 30, 2026 person chitra

ఫీజు , పరీక్ష లేకుండా ఇంటర్ అర్హతతో హైదరాబాద్‌లో 181 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేయండి! | Hyderabad District Anganwadi Teacher Notification 2026 :

Hyderabad District Anganwadi Teacher Notification 2026 :

తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త. హైదరాబాద్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ (WDCW) ఆధ్వర్యంలో 181 మెయిన్ అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు, రాత పరీక్ష కూడా నిర్వహించరు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ (WDCW) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జిల్లా: హైదరాబాద్

పోస్టు పేరు: మెయిన్ అంగన్‌వాడీ టీచర్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 181

విద్య అర్హతలు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

వయోపరిమితి :

వయస్సు గణన తేదీ: 01 జూలై 2026 నాటికీ కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

స్థానికత నిబంధనలు :

1. అభ్యర్థి దరఖాస్తు చేస్తున్న అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన స్థానిక వార్డు నివాసి అయి ఉండాలి.

2. సంబంధిత తహసీల్దార్ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి.

3. నోటిఫికేషన్ విడుదలైన తేదీకి ముందు ఒక సంవత్సరం లోపు పొందిన నివాస ధృవీకరణ పత్రం మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

రిజర్వేషన్ నిబంధనలు :

పోస్టుల వారీగా నిర్దేశించిన రోస్టర్ పాయింట్ (కులం/వర్గం) ప్రకారం అర్హులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

పేరులో మార్పు ఉంటే :

అభ్యర్థి పేరులో మార్పు ఉంటే, గెజిట్ నోటిఫికేషన్ లేదా కోర్టు ఉత్తర్వులు ఉంటే మాత్రమే ఆ మార్పును పరిగణనలోకి తీసుకుంటారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ :

ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన అభ్యర్థులు సంబంధిత ICDS ప్రాజెక్టు కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి.

వెరిఫికేషన్ తేదీలు:

23 ఆగస్టు 2026 నుండి
01 సెప్టెంబర్ 2026 వరకు
సమయం: ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు

అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, దరఖాస్తులో పేర్కొన్న అర్హతలకు సంబంధించిన జిరాక్స్ ప్రతులు (2 సెట్లు) కూడా సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీ : 29 జులై 2026

దరఖాస్తు చివరి తేది: 22 ఆగష్టు 2026

ముఖ్య సూచనలు :

1. కేవలం ఆన్‌లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

2. మాన్యువల్‌గా సమర్పించిన దరఖాస్తులు అంగీకరించబడవు.

3. అవసరమైతే నోటిఫికేషన్‌ను సవరించే లేదా రద్దు చేసే పూర్తి అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది.

Notification Pdf Click Here

Vacancy Details Click Here

Apply Online Link Click Here

Official Website : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *