Innovsource Services Recruitment 2026: తెలంగాణలో 150 ఉద్యోగాలు.. రేపే దరఖాస్తుకు చివరి అవకాశం..!
Innovsource Services Recruitment 2026: తెలంగాణలో 150 ఉద్యోగాలు.. రేపే దరఖాస్తుకు చివరి అవకాశం..!
Innovsource Services Recruitment 2026:
ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ప్రముఖ Innovsource Services Private Limited సంస్థ తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. మొత్తం 150 ఫుల్‌టైమ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ, B.Tech లేదా MBA పూర్తి చేసిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.22,000 నుంచి రూ.50,000 వరకు వేతనం అందించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 4, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: Innovsource Services Private Limited లో ఉద్యోగాలు
గ్రూప్: FirstMeridian Group
భర్తీ చేయనున్న పోస్టులు :
1. Branch Relationship Executive
2. Relationship Manager
3. Team Leader
మొత్తం ఖాళీలు: 150
ఉద్యోగ రకం: ఫుల్‌టైమ్
విద్యార్హతలు :
1. 2023, 2024 లేదా 2025 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
2. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ / B.Tech / MBA పూర్తి చేసి ఉండాలి.
3.మొత్తం విద్యలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.
4. ఎలాంటి Active Backlogs ఉండకూడదు.
5. ఇంటర్మీడియట్ (HSC) పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి :
20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,000 నుంచి రూ.50,000 వరకు CTC అందించనున్నారు.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక కింది రెండు దశల్లో జరుగుతుంది.
1. Face-to-Face Interview
2. HR Interview (Final Round)
ఉద్యోగ బాధ్యతలు:
ఎంపికైన అభ్యర్థులు కింది విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
1. కొత్త కస్టమర్లను గుర్తించి వారిని సంప్రదించడం
2. బ్యాంకింగ్ కార్డులు మరియు ఇతర ఆర్థిక ఉత్పత్తులపై అవగాహన కల్పించడం
3. కస్టమర్ అప్లికేషన్లను ప్రాసెస్ చేయడం
4. బ్యాంకింగ్ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం
5. నెలవారీ సేల్స్ లక్ష్యాలను చేరుకోవడం
6. కస్టమర్లతో దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడం
అవసరమైన నైపుణ్యాలు :
1. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్
2. ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం
3. కస్టమర్ హ్యాండ్లింగ్ సామర్థ్యం
4. సేల్స్‌పై ఆసక్తి
5. నేర్చుకునే తత్వం మరియు సానుకూల దృక్పథం
దరఖాస్తు విధానం :
అర్హత కలిగిన అభ్యర్థులు సంస్థ విడుదల చేసిన Google Form ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి.
Application Link: https://forms.gle/etoY9xgf9Afzoj27A
ముఖ్యమైన తేదీ :
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 4, 2026
గమనిక: తాజా సమాచారం ప్రకారం దరఖాస్తు గడువును ఆగస్టు 4 వరకు పొడిగించారు. అర్హత కలిగిన అభ్యర్థులు గడువు ముగిసేలోపు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి.