Bank Jobs

SBI Clerk Jobs 2026: 1,538 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల….| State Bank of India backlog clerk vacancies 2026 Apply Now :

calendar_month August 8, 2026 person chitra

SBI Clerk Jobs 2026: 1,538 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల….| State Bank of India backlog clerk vacancies 2026 Apply Now :

State Bank of India backlog clerk vacancies 2026:

నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త అందించింది. SBIలో జూనియర్ అసోసియేట్స్ (Customer Support & Sales) పోస్టుల భర్తీకి 2026 సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 1,538 బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు SC, ST, OBC కేటగిరీలకు సంబంధించిన బ్యాక్‌లాగ్ ఖాళీల కోసం ప్రత్యేకంగా ప్రకటించారు.

అర్హత కలిగిన అభ్యర్థులు 07 ఆగస్టు 2026 నుంచి 27 ఆగస్టు 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. SBI అధికారిక వెబ్‌సైట్‌లోని Careers విభాగం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. SBI అధికారిక Careers పేజీలో తాజా నోటిఫికేషన్లు, దరఖాస్తు లింకులు అందుబాటులో ఉంటాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

SBI Clerk Recruitment 2026 – ముఖ్య వివరాలు :

సంస్థ పేరు : స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : జూనియర్ అసోసియేట్ – Customer Support & Sales (SBI Clerk)

మొత్తం పోస్టులు : 1,538

నియామక విధానం: Special Recruitment Drive – Backlog Vacancies

అర్హత కేటగిరీలు: SC / ST / OBC బ్యాక్‌లాగ్ ఖాళీలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీలు :

ఈ SBI Clerk బ్యాక్‌లాగ్ రిక్రూట్‌మెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి సర్కిల్, తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్ కూడా ఉన్నాయి.

అమరావతి సర్కిల్ – 88 పోస్టులు
హైదరాబాద్ సర్కిల్ – 32 పోస్టులు

అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు తమ సర్కిల్, కేటగిరీ, స్థానిక భాషకు సంబంధించిన నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి.

విద్య అర్హతలు :

1. SBI Junior Associate పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

2. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్న గడువు నాటికి అవసరమైన అర్హతను పూర్తి చేసే నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి :

1. 01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనిష్ఠం – 20 సంవత్సరాలు, గరిష్ఠం – 28 సంవత్సరాలు

2. రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించిన వయో సడలింపులు SBI నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము :

1. అప్లికేషన్ ఫీజు కేటగిరీ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థి జనరల్ /ఓబీసీ కేటగిరీకి రూ. 750/- ఫీజు చెల్లించాలి

2. ఈ ప్రత్యేక నియామక ప్రక్రియలో SC, ST, OBC కేటగిరీలకు సంబంధించిన బ్యాక్‌లాగ్ ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తారు. ఇతర కేటగిరీల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు అర్హులు కాదని గమనించాలి.

జీతం వివరాలు :

SBI Junior Associate పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకి 67,000/- వరకు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీ లభిస్తుంది. బేసిక్ పేకు అదనంగా బ్యాంకు నిబంధనల ప్రకారం వివిధ అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. పోస్టింగ్ ప్రాంతం మరియు వర్తించే అలవెన్సుల ఆధారంగా మొత్తం నెలవారీ వేతనం మారవచ్చు.

ఎంపిక విధానం :

SBI Clerk Junior Associate పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా ఆన్‌లైన్ పరీక్షల ఆధారంగా జరుగుతుంది.

1. పిలిమినరీ మరియు మెయిన్ రాత పరీక్ష,

2. స్కిల్ టెస్టు & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

3. Local Language Test

స్థానిక భాషా పరీక్షకు సంబంధించిన నిబంధనలు, మినహాయింపులు మరియు ఇతర వివరాలను అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు పరిశీలించాలి. SBI గత Junior Associate నియామకాల్లో Preliminary, Main Examinationతో పాటు Local Language Test విధానం అమలు చేసింది.

ఎలా అప్లై చేసుకోవాలి ?

SBI Clerk Recruitment 2026కు అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

1. SBI అధికారిక Careers వెబ్‌సైట్‌ ( https://sbi.bank.in/) ను ఓపెన్ చేయాలి.

2. Current Openings విభాగంలో Junior Associates Recruitment నోటిఫికేషన్‌ను గుర్తించాలి.

3. Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.

4. అభ్యర్థి వ్యక్తిగత, విద్యార్హత మరియు ఇతర వివరాలను నమోదు చేయాలి.

5. అవసరమైన పత్రాలు, ఫొటో, సంతకం తదితరాలను నిబంధనల ప్రకారం అప్‌లోడ్ చేయాలి.

6. వర్తించే అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.

7. దరఖాస్తును Submit చేసి Application Formను భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 07 ఆగష్టు 2026

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27 ఆగష్టు 2026

Notification Pdf Click Here

Apply Online Link Click Here

Official Website Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *