AP Jobs : AP జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి. | AP IIITDM Notification 2026 Apply Now :
AP IIITDM Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి శుభవార్త. AP IIITDM (Indian Institute of Information Technology, Design & Manufacturing) నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
ఈ సంస్థ నుంచి మొత్తం 16 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ , స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉంటే చాలు. అంతే కాదు వయస్సు కూడా 18 నుంచి 45 సంవత్సరాల మధ్య మేల్, ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న వారికీ రాత పరీక్ష మరియు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
AP Junior Assistant Jobs Notification 2026- ముఖ్యమైన వివరాలు:
సంస్థ పేరు: AP IIITDM (Indian Institute of Information Technology, Design & Manufacturing) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్
2. స్టాఫ్ నర్స్
3. జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 16
విద్య అర్హతలు:
A )జూనియర్ అసిస్టెంట్ :
జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా డిగ్రీ (BA / BSc / BCom / BBA / BCA) పూర్తి చేసి ఉండాలి.
2. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి (MS Office, Word, Excel, PowerPoint).
3. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
4. డేటా ఎంట్రీ / టైపింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
5. డిగ్రీ పూర్తిచేసిన తాజా అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు.
B ) జూనియర్ టెక్నీషియన్:
జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయాలంటే క్రింది అర్హతలు అవసరం:
1. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి / ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
2. సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికెట్ తప్పనిసరి.
3. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెకానిక్, ఎలక్ట్రానిక్స్, సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
4. టెక్నికల్ రంగంలో కెరీర్ ఆశించే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
C ) స్టాఫ్ నర్స్ :
స్టాఫ్ నర్స్ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
1. గుర్తింపు పొందిన సంస్థ నుంచి GNM (General Nursing & Midwifery) లేదా B.Sc Nursing పూర్తి చేసి ఉండాలి.
2. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదు (Registration) తప్పనిసరి.
3. ఆసుపత్రి లేదా మెడికల్ సంస్థలో పని చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
4. మహిళా అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు ఉండే పోస్టు ఇది.
వయో పరిమితి:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు: 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయస్సు సడలింపు:
1. SC / ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
2. OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
3. PwBD (వికలాంగులు): 10 సంవత్సరాలు
4. ఎక్స్-సర్వీస్‌మెన్: కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. UR , EWS ,OBC అభ్యర్థులకు రూ 500/- ఫీజు
2. SC ,ST ,PWD , WOMEN అభ్యర్థులకు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు . ఉచితం గా అప్లై చేసుకోవచ్చు.
శాలరీ వివరాలు:
AP IIITDM జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకి 50 వేల నుంచి 70 వేల రూపాయల వరకు జీతం ఇస్తారు. అంతేకాకుండా అదనంగా DA, HRA, TA వంటి అలవెన్సులు కూడా అందుతాయి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:
1. లిఖిత పరీక్ష
2. స్కిల్ టెస్ట్ / కంప్యూటర్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. లిఖిత పరీక్షలో సాధారణ జ్ఞానం, ఇంగ్లీష్, రీజనింగ్, కంప్యూటర్ అవగాహన వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. AP IIITDM అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. “Recruitment / Careers” సెక్షన్‌లో నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి.
3. అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించాలి.
4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
5. ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
6. అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 03 జనవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 24 జనవరి 2026.
Official Website : Click Here
Notification pdf : Click Here
Apply Online : Click Here