Railway Jobs: రైల్వేలో 3993 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. పూర్తి నోటిఫికేషన్ విడుదల…RRB JE Recruitment 2026 Apply Now :
Railway Jobs: రైల్వేలో 3993 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. పూర్తి నోటిఫికేషన్ విడుదల…RRB JE Recruitment 2026 Apply Now :
RRB JE Recruitment 2026:
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే నియామక బోర్డు (RRB) జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) తదితర పోస్టుల భర్తీకి CEN No. 04/2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 3,993 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు 14 ఆగస్టు 2026 నుంచి 13 సెప్టెంబర్ 2026 రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ లేదా ఇతర సంబంధిత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం .
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : రైల్వే నియామక బోర్డు (RRB) లో ఉద్యోగాలు
పోస్టు పేరు : జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ తదితర పోస్టులు
పోస్టుల వివరాలు : ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) సహా వివిధ విభాగాల్లో మొత్తం 3,993 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 3,993
ఉద్యోగ స్థాయి : కేంద్ర ప్రభుత్వ రైల్వే ఉద్యోగాలు
విద్య అర్హతలు :
RRB JE Recruitment 2026లో విద్యార్హత పోస్టును బట్టి మారుతుంది. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కొన్ని పోస్టులకు అర్హత పొందవచ్చు. అలాగే డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ వంటి పోస్టులకు సంబంధిత డిగ్రీ అర్హత అవసరం కావచ్చు.
వయోపరిమితి :
1. 01-01-2027 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, PwBD, Ex-Servicemen తదితర రిజర్వేషన్ కేటగిరీలకు వర్తించే వయో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు రుసుము :
అభ్యర్థుల కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
1. SC, ST, Ex-Servicemen, PwBD, మహిళలు, Transgender అభ్యర్థులకు: ₹250
2. ఇతర అభ్యర్థులకు: ₹500 ఫీజు చెల్లింపు
జీతం వివరాలు :
1. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రైల్వే నిబంధనల ప్రకారం జీతం చెల్లిస్తారు.
2. ఈ రిక్రూట్‌మెంట్‌లో పేర్కొన్న పే లెవల్ ప్రకారం ₹35,400 నుంచి ₹1,12,400 వరకు జీతం లభిస్తుంది.
3. దీనికి అదనంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
1. RRB JE Recruitment 2026లో అభ్యర్థుల ఎంపికకు ప్రధానంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తారు.
2. తదుపరి దశల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు పోస్టుకు అనుగుణంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
3. అభ్యర్థులు సంబంధిత CBT పరీక్షలో మెరిట్ సాధించడం ద్వారా తదుపరి ఎంపిక ప్రక్రియకు అర్హత పొందాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
1. RRB అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
2. CEN No. 04/2026 RRB JE Recruitment లింక్‌ను ఎంచుకోవాలి.
3. కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
4. వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
5. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
6. కేటగిరీకి అనుగుణంగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
7. దరఖాస్తును ఒకసారి పరిశీలించి Submit చేయాలి.
8. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ కాపీని సేవ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 14 ఆగష్టు 2026
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13 సెప్టెంబర్ 2026

Notification Pdf Click Here
Apply Link Click Here
Official Website Click Here