పదవ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం లో నోటిఫికేషన్ విడుదల | KGBV Non Teaching Notification 2026 :

పదవ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం లో నోటిఫికేషన్ విడుదల | KGBV Non Teaching Notification 2026 :

KGBV Non Teaching Recruitment 2026 :

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యంగా పదవ తరగతి అర్హత ఉన్నవారికి శుభవార్త. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBV) లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి 2026 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో ప్రత్యేకత ఏమిటంటే రాత పరీక్ష లేకుండా, నేరుగా ఇంటర్వ్యూ / మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకి కేవలం పదవ తరగతి , ఇంటర్మీడియట్ & Any డిగ్రీ అర్హతతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా వయస్సు కూడా 18 నుంచి 52 సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది. KGBV లో 1095 నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. మొత్తం పోస్టులు 63 ఉన్నాయి. కావున దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 20 జనవరి 2026 లోపు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

KGBV Non Teaching Notification 2026 ముఖ్య వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలు కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతాయి.

సంస్థ పేరు: కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం ( KGBV ) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

KGBV నాన్ టీచింగ్ నోటిఫికేషన్ 2026లో ప్రధానంగా క్రింది పోస్టులు ఉన్నాయి:

1. వార్డెన్ (Warden)

2. కుక్ / హెడ్ కుక్

3. అసిస్టెంట్ కుక్

4. అటెండర్

5. వాచ్ ఉమెన్ / నైట్ వాచ్ ఉమెన్

6. స్వీపర్

7. స్కావెంజర్

8. అకౌంటెంట్ (కొన్ని ప్రాంతాల్లో)

9. ANM (సహాయక నర్స్) పోస్టులు ఉన్నాయి

మొత్తం పోస్టులు: 63

రిక్రూట్మెంట్ విధానం: కాంట్రాక్టు బేసిస్ పైన ఉంటాయి.

వయస్సు పరిమితి:

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. SC / ST / BC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 సంవత్సరాల లోపు , వికలాంగులకు 52 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.

విద్య అర్హతలు:

కంప్యూటర్ బోధకుడు:

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి డిగ్రీ (B.Sc / BCA / B.Tech / ఏదైనా డిగ్రీ).

2. కంప్యూటర్ సబ్జెక్ట్‌లో డిప్లొమా / సర్టిఫికెట్ ఉండాలి.

3. కంప్యూటర్ బోధనలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.

వార్డెన్ (Warden):

1. ఇంటర్ లేదా డిగ్రీ అర్హత.

2. బాలికల హాస్టల్ / రెసిడెన్షియల్ స్కూల్‌లో పనిచేసిన అనుభవం ఉంటే అదనపు ప్రాధాన్యం.

3. మహిళా అభ్యర్థులే అర్హులు

కుక్ / హెడ్ కుక్ (Cook / Head Cook):

1. 10వ తరగతి ఉత్తీర్ణత

వంట పనిలో అనుభవం ఉండాలి

2. ప్రభుత్వ / ప్రైవేట్ హాస్టల్ లేదా స్కూల్‌లో పనిచేసిన అనుభవం ఉంటే మంచిది.

అసిస్టెంట్ కుక్ :

1. 10వ తరగతి పాస్ లేదా 7వ తరగతి పాస్ అయి ఉండాలి.

2. వంట పనిలో ప్రాథమిక అవగాహన ఉండాలి.

3. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.

అటెండర్ (Attender):

1. 10వ తరగతి ఉత్తీర్ణత.

2. కార్యాలయ పనులు చేయగలగాలి

3. సంబంధిత పనిలో అనుభవం ఉంటే మంచిది.

వాచ్ ఉమెన్ / నైట్ వాచ్ ఉమెన్:

1. 10వ తరగతి పాస్.

2. రాత్రి విధులు నిర్వహించగల శారీరక సామర్థ్యం ఉండాలి.

3. భద్రతా విధుల్లో అనుభవం ఉంటే అదనపు ప్రాధాన్యం.

స్వీపర్ :

1. చదవడం, రాయడం వచ్చి ఉండాలి.

2. ప్రత్యేక విద్యార్హత అవసరం లేదు.

3. పరిశుభ్రత పనుల్లో అనుభవం ఉంటే ప్రాధాన్యం.

స్కావెంజర్ (Scavenger):

1. ఎలాంటి విద్యార్హత అవసరం లేదు.

2. శారీరకంగా పనికి అనుకూలంగా ఉండాలి.

3. సంబంధిత పనిలో అనుభవం ఉంటే మంచిది.

అకౌంటెంట్ :

1. B.Com / B.A (Accounts) / B.Sc (Accounts)

2. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

3. అకౌంట్స్ సంబంధిత సాఫ్ట్‌వేర్ అవగాహన ఉండాలి.

ANM (సహాయక నర్స్):

1. ANM కోర్సు పూర్తి చేసి ఉండాలి.

2. సంబంధిత నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ ఉండాలి.

3. హాస్టల్ / స్కూల్ నర్స్‌గా పనిచేసిన అనుభవం ఉంటే ప్రాధాన్యం.

జీతం వివరాలు:

1. పోస్టును బట్టి జీతం మారుతుంది. ₹8,000 నుండి ₹45,000 వరకు నెల జీతం ఇస్తారు.

2. కొన్ని పోస్టులకు అదనపు భత్యాలు ఉండవచ్చు.

3. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం ఉంటుంది.

దరఖాస్తు విధానం:

1. KGBV Non Teaching Notification 2026కు ఆన్‌లైన్ అప్లికేషన్ లేదు.
2. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
3. సంబంధిత జిల్లా విద్యాశాఖ / సమగ్ర శిక్ష కార్యాలయం నుండి అప్లికేషన్ ఫారం పొందాలి.
4. అవసరమైన సర్టిఫికేట్లతో పాటు అప్లికేషన్ సమర్పించాలి.

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష లేదు.
2. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
3. ఇంటర్వ్యూ / సర్టిఫికేట్ వెరిఫికేషన్
4. జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఫారం పొందాలి.

2. అప్లికేషన్ ఫారం నింపండి

అప్లికేషన్ ఫారంలో క్రింది వివరాలను స్పష్టంగా నింపాలి:

అభ్యర్థి పేరు

తండ్రి / భర్త పేరు

జన్మతేది

వయస్సు

విద్యార్హత వివరాలు

అప్లై చేస్తున్న పోస్టు పేరు

పూర్తి చిరునామా

మొబైల్ నెంబర్ తప్పు లేకుండా రాయండి.

3. అవసరమైన సర్టిఫికేట్లు జత చేయండి.

అప్లికేషన్ ఫారంతో పాటు క్రింది డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు జత చేయాలి:

10వ తరగతి మార్క్స్ మెమో

ఇంటర్ / డిగ్రీ / ANM / కంప్యూటర్ సర్టిఫికెట్ (పోస్టును బట్టి)

ఆధార్ కార్డు

కుల ధృవీకరణ పత్రం (ఉండితే)

నివాస ధృవీకరణ పత్రం

అనుభవ సర్టిఫికెట్ (ఉండితే)

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.

4. అప్లికేషన్ ఫారం ని సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ ప్రారంభ తేదీ: 05 జనవరి 2026

ఆఫ్ లైన్ దరఖాస్తుల ప్రారంభం: 06 జనవరి 2026

దరఖాస్తుల చివరి తేదీ:20 జనవరి 2026 .

Notification pdf : Click Here

Vacancy List : Click Here

Official Website : Click Here

Application Link : Click Here

Leave a Comment