మండపేటలో ఆగష్టు 24 న భారీ జాబ్‌మేళా …1,335 ఉద్యోగాలు.. 13 ప్రముఖ కంపెనీల్లో అవకాశాలు… మిస్ అవ్వొద్దు…
మండపేటలో ఆగష్టు 24 న భారీ జాబ్‌మేళా …1,335 ఉద్యోగాలు.. 13 ప్రముఖ కంపెనీల్లో అవకాశాలు… మిస్ అవ్వొద్దు…
మండపేటలో భారీ జాబ్‌మేళా 2026 :
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026 ఆగస్టు 24న భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో మొత్తం 13 ప్రముఖ కంపెనీలు పాల్గొంటుండగా, వివిధ విభాగాల్లో 1,335 ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
SSC, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, B.Tech, MBA, ఫార్మసీ వంటి విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.12,000 నుంచి రూ.22,000 వరకు వేతనం లభించనుంది.
జాబ్‌మేళా లో పాల్గొనే కంపెనీలు, ఉద్యోగ ఖాళీలు:
| క్రమ సంఖ్య | కంపెనీ పేరు | పోస్టులు | ఖాళీలు | అర్హత | వయసు | వేతనం |
|---|---|---|---|---|---|---|
| 1 | అపోలో ఫార్మసీ | Pharmacist / Pharmacy Assistant / Retail Trainee | 30 | D.Pharmacy / B.Pharmacy / M.Pharmacy | 19–35 సంవత్సరాలు | ₹14,000–₹16,000 |
| 2 | బ్యాంక్ ఆఫ్ బరోడా | CRE | 10 | ఏదైనా డిగ్రీ | 19–29 సంవత్సరాలు | ₹20,000 |
| 3 | HDB Financial Services | వివిధ ఉద్యోగాలు | 40 | ఏదైనా డిగ్రీ | 19–35 సంవత్సరాలు | ₹14,000–₹20,000 |
| 4 | జోయాలుక్కాస్ | Sales Executive | 300 | ఇంటర్ | 19–25 సంవత్సరాలు | ₹22,000 |
| 5 | KIA Motors | Operators | 100 | SSC / ITI / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ | 19–30 సంవత్సరాలు | ₹16,000 |
| 6 | లక్ష్మీ హ్యుందాయ్ | వివిధ ఉద్యోగాలు | 20 | ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ / B.Tech | 19–35 సంవత్సరాలు | ₹12,000–₹20,000 |
| 7 | MCV Moto Corp | AGM Sales | 20 | MBA | 19–35 సంవత్సరాలు | ₹12,000–₹16,000 |
| 8 | Muthoot Microfin Ltd | RO / SRO | 25 | ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ | 19–29 సంవత్సరాలు | ₹13,000 |
| 9 | Rajendra Energy Power Solutions | Trainee Sales / Manager / Sales Manager / Senior Manager | 100 | SSC / ITI / డిప్లొమా | 19–34 సంవత్సరాలు | ₹14,000–₹16,000 |
| 10 | Royal Security Force & Allied Force | Security / Helper | 60 | ఇంటర్ | 25–30 సంవత్సరాలు | ₹14,000–₹20,000 |
| 11 | SBI Payments | FOS / TL | 30 | ఇంటర్ మరియు అంతకంటే ఎక్కువ | 21–35 సంవత్సరాలు | ₹22,000 |
| 12 | Tata Electronics | Junior Technician | 500 | SSC / ITI / ఇంటర్ / డిప్లొమా | 18–26 సంవత్సరాలు | ₹19,175 |
| 13 | UNO Minda | Operators | 100 | SSC / ITI / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ | 19–30 సంవత్సరాలు | ₹16,428 |
మండపేట జాబ్‌మేళా ముఖ్య వివరాలు :
జాబ్‌మేళా తేదీ : 24 ఆగస్టు 2026
వేదిక : ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండపేట
పాల్గొనే కంపెనీలు : 13
మొత్తం ఖాళీలు : 1,335
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ : 7396740041
అభ్యర్థులు ఏం చేయాలి?
ఈ జాబ్‌మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు 2026 ఆగస్టు 24న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండపేటకు హాజరు కావాలి. తమ విద్యార్హతలు, వయస్సుకు సంబంధించిన అవసరమైన పత్రాలను వెంట తీసుకెళ్లడం మంచిది.
ఉద్యోగానికి సంబంధించిన మరిన్ని వివరాలు, హాజరు ప్రక్రియ లేదా ఇతర సందేహాల కోసం 7396740041 నంబర్‌ను సంప్రదించవచ్చు.