AP Jobs

AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ : 

calendar_month August 24, 2026 person chitra

AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ :

AP Job Calendar 2026 పూర్తి వివరాలు :

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన AP Job Calendar 2026 ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 10,060 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో అభ్యర్థులు సంబంధిత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడకుండా ముందుగానే పరీక్షలకు సిద్ధం కావడం మంచిది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు నాలుగు దశల్లో విడుదల కానున్నందున ప్రతి దశలో ఏ శాఖలకు సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తారో అభ్యర్థులు గమనించాలి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, పరీక్ష విధానం, సిలబస్, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలు అధికారికంగా వెల్లడిస్తారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీ :

దశ పోస్టుల సంఖ్య నోటిఫికేషన్
మొదటి దశ 1,523 ఇప్పటికే విడుదల
రెండో దశ 3,231 సెప్టెంబర్ 15
మూడో దశ 2,311 అక్టోబర్ 15
నాలుగో దశ 2,995 అక్టోబర్ 15
మొత్తం 10,060

1.మొదటి దశలో ఇప్పటికే 1,523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైనట్లు పేర్కొన్నారు.

2. రెండో దశలో సెప్టెంబర్ 15న 3,231 పోస్టులకు,

3. మూడో మరియు నాలుగో దశల్లో అక్టోబర్ 15న వరుసగా 2,311, 2,995 పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

ఏ శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయి?

ఈ జాబ్ క్యాలెండర్‌లో గ్రూప్-1లో 149 పోస్టులు, గ్రూప్-2లో 673 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు విద్యాశాఖలో టీచర్ పోస్టులు, పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, విద్యుత్, ఎక్సైజ్, ఇంజినీరింగ్ తదితర శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.

రెండో దశలో ముఖ్యమైన పోస్టులు : 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

రెండో దశలో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ వంటి కీలక పోస్టులతో పాటు 542 కానిస్టేబుల్, 182 ఎస్‌ఐ, 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నట్లు సమాచారం.

మూడో దశలో పోస్టులు : 

మూడో దశలో 200 డిప్యూటీ తహసీల్దార్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్, 224 ఏఈఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే విద్యుత్ సంస్థల్లో 629 ఏఈఈ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు.

నాలుగో దశలో DSC ఉద్యోగాలు : 

నాలుగో దశలో DSC నోటిఫికేషన్ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు ఇతర శాఖల్లోని ఖాళీలకు కూడా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

అభ్యర్థులకు ముఖ్య సూచన : 

AP Job Calendar 2026 ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానుండటంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆసక్తి పెరిగింది. అయితే పోస్టుల సంఖ్య, అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తేదీలు వంటి వివరాలను సంబంధిత అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మాత్రమే నిర్ధారించుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *