UPSC EPFO Recruitment 2026: పెన్షన్ అందించే సంస్థలో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు దరఖాస్తులు… Apply Now :
UPSC EPFO Recruitment 2026: పెన్షన్ అందించే సంస్థలోఅసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు దరఖాస్తులు… Apply Now :
UPSC EPFO Recruitment 2026:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుంచి ఉద్యోగార్థులకు మరో మంచి అవకాశం వచ్చింది. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ” ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)” లో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 80 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 11, 2026 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టులు
మొత్తం ఖాళీలు: 80
ఉద్యోగ విధానం: రెగ్యులర్ ప్రాతిపదికన
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
విద్యార్హతలు :
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అదనంగా కంపెనీ చట్టం, కార్మిక చట్టాలు లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
వయోపరిమితి :
అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి కేటగిరీ ఆధారంగా ఉంటుంది.
UR/EWS: 35 సంవత్సరాలు
OBC: 38 సంవత్సరాలు
SC/ST: 40 సంవత్సరాలు
PwBD: నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపు ఉంటుంది. గరిష్ట వయోపరిమితి 56 సంవత్సరాలకు లోబడి ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
మహిళలు, SC, ST మరియు బెంచ్‌మార్క్ డిసేబిలిటీ ఉన్న అభ్యర్థులకు నిబంధనల ప్రకారం దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
మిగిలిన అభ్యర్థులు రూ.25 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఫీజును క్రెడిట్/డెబిట్ కార్డు, UPI లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
జీతం వివరాలు :
1. ఎంపికైన అభ్యర్థులకు 7వ సెంట్రల్ పే కమిషన్ (7th CPC) పే మ్యాట్రిక్స్‌లో లెవెల్-10 ప్రకారం వేతనం లభిస్తుంది.
2. నెల జీతం: రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు
3. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు నిబంధనల ప్రకారం లభిస్తాయి.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపికలో ప్రధానంగా కింది దశలు ఉంటాయి:
1. రాత పరీక్ష
2. ఇంటర్వ్యూ
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. మెడికల్ పరీక్ష
5. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు UPSC అధికారిక ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ (ORA) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర అర్హతలు, ఫీజు మరియు ఎంపిక విధానాన్ని పూర్తిగా పరిశీలించడం మంచిది.
ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్: upsconline.nic.in/ora/
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22 ఆగష్టు 2026
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11 సెప్టెంబర్ 2026
Notification Pdf Click Here
Online Apply Link Click Here
Official Website Click Here