బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 205 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 25 వరకు దరఖాస్తులు… Apply Now :
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 205 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 25 వరకు దరఖాస్తులు… Apply Now :
Bank of India Specialist Officer Recruitment 2026:
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు Bank of India (BOI) మంచి అవకాశాన్ని ప్రకటించింది. వివిధ విభాగాల్లో 205 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు Project No. 2026-27/02 కింద స్కేల్-I నుంచి స్కేల్-IV వరకు జరుగుతాయి.
ఫుల్ స్టాక్ ఇంజినీరింగ్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్, డేటా ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, డిజిటల్ బ్యాంకింగ్, లా, ఫైర్ సేఫ్టీ, సివిల్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Bank of India (BOI) లో ఉద్యోగాలు
రిక్రూట్‌మెంట్ ; Officers in Various Streams up to Scale IV
పోస్టుల వివరాలు :
ఈ రిక్రూట్‌మెంట్‌లో స్కేల్‌ను బట్టి ఖాళీలు కేటాయించారు. వివరాలు ఇలా ఉన్నాయి:
| స్కేల్ | పోస్టు | ఖాళీలు |
|---|---|---|
| Scale IV | Chief Manager | 10 |
| Scale III | Senior Manager | 49 |
| Scale II | Manager | 118 |
| Scale I | Officer | 28 |
| మొత్తం | 205 |
మొత్తం పోస్టులు : 205
విద్య అర్హతలు :
ఈ నోటిఫికేషన్‌లో పోస్టును బట్టి విద్యార్హతలు, అనుభవం మారుతుంది.
వయో సడలింపు :
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
SC/ST: 5 సంవత్సరాలు
OBC (Non-Creamy Layer): 3 సంవత్సరాలు
PwBD: 10 సంవత్సరాలు
Ex-Servicemen: 5 సంవత్సరాలు
1984 అల్లర్ల ప్రభావితులు: 5 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము :
కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీజు మారుతుంది.
1. SC/ST/PwBD: ₹175/-
2. General/EWS/OBC: ₹1,180/-
ఈ మొత్తాల్లో GSTతో పాటు వర్తించే ఛార్జీలు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన అదనపు ఛార్జీలు ఉంటే వాటిని అభ్యర్థులే భరించాలి.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు బ్యాంకు నిబంధనల ప్రకారం సంబంధిత స్కేల్‌లో వేతనం చెల్లిస్తారు. దీనికి అదనంగా వర్తించే అలవెన్సులు, పర్క్విజిట్స్ కూడా లభిస్తాయి.
| స్కేల్ | పే స్కేల్ |
|---|---|
| JMGS-I | ₹48,480 – ₹85,920 |
| MMGS-II | ₹64,820 – ₹93,960 |
| MMGS-III | ₹85,920 – ₹1,05,280 |
| SMGS-IV | ₹1,02,300 – ₹1,20,940 |
ఎంపికైన అభ్యర్థులు నిబంధనల ప్రకారం రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. JMGS-Iకి ₹1 లక్ష, MMGS-IIకి ₹2 లక్షలు, MMGS-III మరియు అంతకంటే పై స్థాయిలకు ₹3 లక్షల డిపాజిట్ అవసరం.
నిబంధనల ప్రకారం సంతృప్తికరంగా మూడేళ్ల సేవ పూర్తిచేసిన తర్వాత ఈ డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. అంతకంటే ముందే ఉద్యోగం వదిలితే నిబంధనల ప్రకారం డిపాజిట్ జప్తు కావచ్చు.
ఎంపిక విధానం :
BOI Specialist Officer Recruitment 2026లో అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష మరియు/లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. పోస్టు, అభ్యర్థుల సంఖ్య తదితర అంశాలను బట్టి బ్యాంకు ఎంపిక విధానాన్ని నిర్ణయిస్తుంది.
రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన విద్యార్హతలు, అనుభవం, సర్టిఫికెట్లు మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పరీక్ష లేదా ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు బ్యాంకు సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
ఎలా అప్లై చేసుకోవాలి ?
1. ముందుగా Bank of India అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లాలి.
2. అక్కడ Careers విభాగాన్ని ఓపెన్ చేయాలి.
3. Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.
4. “Click here for New Registration” ఆప్షన్‌పై క్లిక్ చేసి కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
5. పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ తదితర వివరాలు నమోదు చేయాలి.
6. వచ్చిన Registration Number, Passwordను భద్రంగా ఉంచుకోవాలి.
7. . విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.
8. సూచించిన పరిమాణంలో ఫొటో, సంతకం, ఎడమ బొటనవేలు ముద్ర, హ్యాండ్‌రైటెన్ డిక్లరేషన్ వంటి పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
9. పూర్తి చేసిన అప్లికేషన్‌ను ప్రివ్యూ చేసి వివరాలను మరోసారి తనిఖీ చేయాలి.
10. అనంతరం అవసరమైన అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
11. Complete Registration చేసిన తర్వాత అప్లికేషన్ ఫారం, ఈ-రిసీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 10 సెప్టెంబర్ 2026
దరఖాస్తుకు చివరి తేదీ: 25 సెప్టెంబర్ 2026
Notification Pdf : Click Here
Apply Link : Click Here