Central Govt Jobs

Railway Jobs 2026: రైల్వేలో 560 పారామెడికల్ ఉద్యోగాలు.. అక్టోబర్ 14 వరకు దరఖాస్తులు!

calendar_month September 9, 2026 person chitra

Railway Jobs 2026: రైల్వేలో 560 పారామెడికల్ ఉద్యోగాలు.. అక్టోబర్ 14 వరకు దరఖాస్తులు!

Railway Jobs 2026:

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) పారామెడికల్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి కీలక ప్రకటన విడుదల చేశాయి. కేంద్రీకృత ఉపాధి ప్రకటన (CEN) నెం. 05/2026 ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 560 పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ రిక్రూట్‌మెంట్‌లో నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-II, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్/ఎక్స్-రే టెక్నీషియన్, ECG టెక్నీషియన్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ వంటి పోస్టులు ఉన్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పూర్తి అర్హతలు, పోస్టుల వారీగా విద్యార్హతలు, ఫీజు, పరీక్షా విధానం, జోన్‌ల వారీగా ఖాళీల వివరాలు తదితర సమాచారంతో కూడిన వివరణాత్మక CEN 05/2026 నోటిఫికేషన్‌ను RRBలు ప్రత్యేకంగా విడుదల చేయనున్నాయి.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. నర్సింగ్ సూపరింటెండెంట్

2. డయాలసిస్ టెక్నీషియన్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-II

4. ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్)

5. రేడియోగ్రాఫర్ / ఎక్స్-రే టెక్నీషియన్

6. ECG టెక్నీషియన్

7. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ పోస్టులు

మొత్తం పోస్టులు : 560

ముఖ్యాంశం వివరాలు
రిక్రూట్‌మెంట్ Railway Paramedical Recruitment 2026
నోటిఫికేషన్ CEN 05/2026
బోర్డు Railway Recruitment Boards (RRBs)
మొత్తం పోస్టులు 560
పోస్టులు Nursing Superintendent, Dialysis Technician తదితరాలు
వయసు 18–33 సంవత్సరాలు
ఎంపిక విధానం CBT, Document Verification, Medical Examination
జీతం ₹21,700 – ₹44,900
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభం సెప్టెంబర్ 15, 2026
చివరి తేదీ అక్టోబర్ 14, 2026
అధికారిక పోర్టల్ rrbapply.gov.in

విద్యార్హతలు :

పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. సంబంధిత పోస్టులకు అవసరమైన 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా సంబంధిత వైద్య/పారామెడికల్ కోర్సు అర్హతలు ఉండే అవకాశం ఉంది.

వయోపరిమితి :

ఈ రైల్వే పారామెడికల్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తించే అవకాశం ఉంటుంది.

జీతం వివరాలు :

1. పోస్టును బట్టి పే లెవల్ మారుతుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులకు ₹21,700 నుంచి ₹44,900 వరకు నెలవారీ ప్రాథమిక వేతనం లభించే అవకాశం ఉంది.

2. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ/రైల్వే నిబంధనల ప్రకారం వర్తించే అలవెన్సులు లభిస్తాయి.

ఎంపిక విధానం :

రైల్వే పారామెడికల్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక సాధారణంగా కింది దశల ఆధారంగా ఉంటుంది:

1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. మెడికల్ ఎగ్జామినేషన్

అభ్యర్థులు CBTలో సాధించిన మార్కులు, తదుపరి ఎంపిక దశల్లో అర్హత సాధించడం ఆధారంగా తుది నియామక ప్రక్రియ కొనసాగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

Railway Paramedical Recruitment 2026కు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు కోసం RRB అధికారిక అప్లికేషన్ పోర్టల్‌ను ఉపయోగించాలి:

Official Website: https://www.rrbapply.gov.in

దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇతర అవసరమైన సమాచారాన్ని నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నమోదు చేయాలి.

ఆధార్ వివరాలు సరిపోవాలి ?

దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు తమ గుర్తింపు వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా 10వ తరగతి సర్టిఫికెట్‌లో ఉన్న పూర్తి పేరు, పుట్టిన తేదీ మరియు ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ సరిపోలేలా ఉండేలా చూసుకోవడం మంచిది.

దరఖాస్తు తేదీలు :

RRB CEN 05/2026కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులను ఈ నెల 15 నుంచి అక్టోబర్ 14 వరకు స్వీకరించనున్నట్లు షార్ట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Notification Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *