AP Jobs

AP ASHA Worker Jobs 2026: 10వ తరగతి అర్హతతో 71 ఆశా కార్యకర్త పోస్టులు.. సెప్టెంబర్ 25 చివరి తేదీ..!

calendar_month September 18, 2026 person chitra

AP ASHA Worker Jobs 2026: 10వ తరగతి అర్హతతో 71 ఆశా కార్యకర్త పోస్టులు.. సెప్టెంబర్ 25 చివరి తేదీ..!

AP ASHA Worker Jobs 2026:

ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) పరిధిలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 71 ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు 2026 సెప్టెంబర్ 25 చివరి తేదీగా నిర్ణయించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తారు. ఈ నియామకంలో సంబంధిత గ్రామంలో నివసించే మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థుల అర్హత, మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

AP ASHA Worker Jobs 2026 – ముఖ్యమైన వివరాలు :

సంస్థ పేరు : నేషనల్ హెల్త్ మిషన్ (NHM) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : ఆశా కార్యకర్త (ASHA Worker) లో పోస్టులు

మొత్తం పోస్టులు : 71

విద్య అర్హతలు :

ఆశా కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళ సంబంధిత గ్రామంలో నివసిస్తూ ఉండాలి. సాధారణంగా వివాహిత, వితంతువు, విడాకులు పొందిన లేదా భర్త నుంచి విడిపోయిన మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అభ్యర్థికి ప్రజలతో సమర్థవంతంగా మాట్లాడే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, సమాజంతో సన్నిహితంగా పనిచేసే సామర్థ్యం ఉండాలి. కనీసం 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన అక్షరాస్యురాలు అయి ఉండాలి.

ఆశా కార్యకర్తగా విధులు నిర్వహించేందుకు అవసరమైన సమయాన్ని కేటాయించడానికి కుటుంబ, సామాజిక సహకారం ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

వయోపరిమితి :

25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఆశా కార్యకర్తల నియామకంలో ఇంటర్వ్యూ/మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టనున్నారు. సంబంధిత గ్రామం నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తుతో జత చేయాల్సిన పత్రాలు :

అభ్యర్థులు తమ దరఖాస్తును సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వద్ద సమర్పించేటప్పుడు అవసరమైన ధ్రువపత్రాల కాపీలను జత చేయాలి.

1. SSC సర్టిఫికేట్ కాపీ – పుట్టిన తేదీకి రుజువుగా

2. సంబంధిత ప్రాంతంలోని VHSNC తీర్మానం, ఆమోదం కాపీ.

3. SC, ST, BC అభ్యర్థులు తాజా కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

4. ఆధార్ కార్డు/రేషన్ కార్డు/ఇతర గుర్తింపు ధ్రువీకరణ పత్రం కాపీ.

5. దివ్యాంగుల కోటాలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు SADAREM మెడికల్ బోర్డు జారీ చేసిన తాజా వైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించాలి

కుల ధ్రువీకరణ పత్రం సమర్పించని సందర్భంలో సంబంధిత నిబంధనల ప్రకారం అభ్యర్థిని OC కేటగిరీగా పరిగణించే అవకాశం ఉంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

అవసరమైన ధ్రువపత్రాల కాపీలను జత చేసి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వద్ద నిర్ణీత గడువులోగా సమర్పించాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 25 సెప్టెంబర్ 2026. కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా సంబంధిత PHCలో దరఖాస్తు సమర్పించడం మంచిది.

ఈ ఆశా కార్యకర్తల నియామకానికి సంబంధించి గ్రామీణ ఆరోగ్య, పారిశుధ్య, పౌష్టికాహార కమిటీ (VHSNC) ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్లో అర్హత, ప్రతిభ ఆధారంగా ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి వారి దరఖాస్తులను జిల్లా కార్యాలయాలకు పంపించనున్నారు. అనంతరం జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ (DHS) ద్వారా తుది నియామక ప్రక్రియ చేపడతామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డా. U. శోభ తెలిపారు.

ముఖ్యమైన తేదీలు :

కార్యక్రమం తేదీ
నోటిఫికేషన్ జారీ 15-09-2026
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 25-09-2026
తాత్కాలిక మెరిట్ జాబితా, అభ్యంతరాల స్వీకరణ 12-10-2026
తుది మెరిట్ జాబితా, ఎంపిక ప్రకటన 19-10-2026
సంబంధిత వైద్య అధికారులకు అనుమతి జారీ 27-10-2026

1st Notification Pdf Click Here

2nd Notification Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *