telangana jobs

TGPSC HMWS&SB Manager Recruitment 2026: మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్.. జీతం రూ.1.33 లక్షల వరకు…వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month September 19, 2026 person chitra

TGPSC HMWS&SB Manager Recruitment 2026: మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్.. జీతం రూ.1.33 లక్షల వరకు…వెంటనే అప్లై చేసుకోండి.

TGPSC HMWS&SB Manager Recruitment 2026:

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB)లో మేనేజర్ (ఇంజినీరింగ్) ఖాళీల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. . ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 17, 2026 సాయంత్రం 5 గంటల వరకు TGPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు లో జాబ్స్

రిక్రూట్‌మెంట్ సంస్థ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)

పోస్టు పేరు : Manager (Engineering)

మొత్తం ఖాళీలు: 130

విద్య అర్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Civil Engineering – 80%

Electrical / Mechanical Engineering – 15%

CSE / IT / ECE Engineering – 5%

వయోపరిమితి :

అభ్యర్థుల వయస్సును 01-07-2026 నాటికి పరిగణిస్తారు.

కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు

రిజర్వేషన్ కేటగిరీలకు వర్తించే వయో సడలింపులు అధికారిక నిబంధనల ప్రకారం ఉంటాయి.

దరఖాస్తు రుసుము :

TGPSC HMWS&SB Manager Recruitment 2026కు దరఖాస్తు చేసే అభ్యర్థులు కింది ఫీజులు చెల్లించాలి.

దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు:

OC & BC అభ్యర్థులకు: రూ.1,000
SC, ST & PwD అభ్యర్థులకు: రూ.500

పరీక్ష రుసుము:

పరీక్ష ఫీజు: రూ.120

నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు లేదా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిర్దేశించిన పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు రూ.54,220–రూ.1,33,630 పే స్కేల్‌లో జీతం అందుతుంది. ఇతర అలవెన్సులు, సర్వీస్ నిబంధనలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక CBRT/OMR విధానంలో నిర్వహించే ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష ద్వారా జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. ముందుగా TGPSC అధికారిక వెబ్‌సైట్‌ ( https://www.tgpsc.gov.in ) ను సందర్శించాలి.

2. మీ Registered OTR Numberతో లాగిన్ అవ్వాలి.

3. TGPSC నోటిఫై చేసిన పోస్టులకు మొదటిసారి దరఖాస్తు చేస్తున్నట్లయితే ముందుగా One Time Registration (OTR) పూర్తి చేయాలి.

4. OTRలో అవసరమైన బయోడేటా వివరాలను నమోదు చేయాలి.

5. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అభ్యర్థికి User ID జనరేట్ అవుతుంది.

6. ఈ User ID రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్‌కు పంపబడుతుంది.

7. సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఓపెన్ చేయాలి.

8. విద్యార్హత, వ్యక్తిగత వివరాలు, ఇతర అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.

9. అవసరమైన ఫీజును చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.

10. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 23 సెప్టెంబర్ 2026

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 17 అక్టోబర్ 2026

Notification Click Here

Apply Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *