AP Jobs

ఆశా కార్యకర్తల ఉద్యోగాలు 2026: మహిళలకు ఉద్యోగ అవకాశం.. అర్హతలు, మార్కులు, దరఖాస్తు వివరాలు ఇవే!

calendar_month September 23, 2026 person chitra

ఆశా కార్యకర్తల ఉద్యోగాలు 2026: మహిళలకు ఉద్యోగ అవకాశం.. అర్హతలు, మార్కులు, దరఖాస్తు వివరాలు ఇవే!

Asha Worker Jobs 2026:

మహిళలకు ఉద్యోగ అవకాశం కల్పించేలా ఆశా (ASHA) కార్యకర్తల ఖాళీల భర్తీకి నియామక ప్రకటన విడుదలైంది. సంబంధిత గ్రామం/వార్డు సచివాలయం పరిధిలో నివసించే అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ Asha Worker Recruitment 2026లో అర్హతలు, వయసు, అవసరమైన ధ్రువపత్రాలు, ఎంపిక విధానం, మార్కుల వివరాలను తెలుసుకుందాం.

ఆశా కార్యకర్తల ఉద్యోగాలు 2026 :

స్వర్ణ గ్రామం (సచివాలయం) వార్డు పరిధిలోని అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత గ్రామ/వార్డు సచివాలయం పరిధిలోని PHC/UPHC మెడికల్ ఆఫీసర్ వద్ద తమ దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు ప్రధానంగా కింది అర్హతలు ఉండాలి.

1. 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.

2. సంబంధిత గ్రామం లేదా వార్డు సచివాలయం పరిధిలో నివసిస్తూ ఉండాలి.

3. వయసు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

4. అభ్యర్థి వివాహిత మహిళ అయి ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. తెలుగు భాషను చదవడం, రాయడం వచ్చి ఉండాలి.

6. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీల ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై అవగాహన ఉండాలి.

7. ప్రజలకు విషయాలను స్పష్టంగా వివరించే సామర్థ్యం ఉండాలి.

8. ప్రజలతో కలిసి పనిచేయడం, సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం, నాయకత్వ లక్షణాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, భర్త నుంచి విడిపోయిన మహిళలు, నిరాశ్రయ మహిళలకు ఎంపికలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన లేదా ప్రస్తుతం పనిచేస్తున్న మహిళలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తుతో ఏ పత్రాలు సమర్పించాలి?

అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కింది ధ్రువపత్రాలను జత చేయాలి.

1. 10వ తరగతి సర్టిఫికెట్ కాపీ

2. నివాస ధ్రువీకరణ పత్రం

3. తహసీల్దార్ జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం లేదా రేషన్ కార్డు/BPL కార్డు/ఓటర్ కార్డు/ఆధార్ కార్డు/బ్యాంక్ పాస్‌బుక్ వంటి నివాస ఆధారాలు

4. స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన అనుభవ ధ్రువపత్రం ఉంటే దాని కాపీ

5. ఐదేళ్లలోపు పిల్లలు ఉంటే, వయసుకు తగిన టీకాలు పూర్తిగా వేయించినట్లు చూపించే ధ్రువపత్రం లేదా మాతా శిశు సంరక్షణ కార్డు

6. వితంతువు, విడాకులు పొందిన, భర్త నుంచి విడిపోయిన లేదా నిరాశ్రయ మహిళ అయితే సంబంధిత వైవాహిక స్థితికి సంబంధించిన స్వీయ డిక్లరేషన్

ఆశా కార్యకర్తల ఎంపిక విధానం : 

ఆశా కార్యకర్తల ఎంపికలో మొత్తం 100 మార్కులు కేటాయించారు. విద్యార్హత, స్వచ్ఛంద సంస్థలో అనుభవం, వైవాహిక స్థితి, పిల్లల ఇమ్మునైజేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.

అంశం మార్కులు
విద్యార్హత 20
NGO అనుభవం 20
వైవాహిక స్థితి 10
పిల్లల ఇమ్మునైజేషన్ 10
ఇంటర్వ్యూ 40
మొత్తం 100
విద్యార్హతకు 20 మార్కులు

10వ తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులైన వారికి 20 మార్కులు, సెకండ్ క్లాస్‌కు 10 మార్కులు, థర్డ్ క్లాస్‌కు 5 మార్కులు కేటాయిస్తారు.

NGO అనుభవానికి 20 మార్కులు : 

ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్లో ఐదేళ్లకు పైగా పనిచేసిన వారికి 20 మార్కులు, ఒకటి నుంచి ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి 10 మార్కులు, ఒక సంవత్సరం కంటే తక్కువ అనుభవం ఉన్నవారికి 5 మార్కులు ఇస్తారు.

వైవాహిక స్థితికి 10 మార్కులు : 

వితంతువు, విడాకులు పొందిన, భర్త నుంచి విడిపోయిన లేదా నిరాశ్రయ మహిళలకు ఈ విభాగంలో 10 మార్కులు కేటాయిస్తారు.

పిల్లల ఇమ్మునైజేషన్‌కు 10 మార్కులు : 

అభ్యర్థికి ఐదేళ్లలోపు పిల్లలు ఉండి, వారికి వయసుకు అనుగుణంగా అవసరమైన అన్ని టీకాలు పూర్తయినట్లయితే 10 మార్కులు లభిస్తాయి.

ఇంటర్వ్యూకు 40 మార్కులు : 

ఆశా కార్యకర్తల ఎంపికలో ఇంటర్వ్యూకు అత్యధికంగా 40 మార్కులు కేటాయించారు. ఇందులో తెలుగు చదవడం, రాయడం వంటి అంశాలకు 20 మార్కులు ఉంటాయి. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, పోషకాహారం, పోషకాహార లోపం వంటి అంశాలపై అభ్యర్థికి ఉన్న అవగాహనకు 10 మార్కులు కేటాయిస్తారు. మిగిలిన అంశాలు సంబంధిత ఎంపిక ప్రక్రియలో పరిశీలిస్తారు.

దరఖాస్తు ఎక్కడ సమర్పించాలి?

అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న గడువులోపు తమ దరఖాస్తులను సంబంధిత PHC/UPHC మెడికల్ ఆఫీసర్ వద్ద సమర్పించాలి. దరఖాస్తు అందజేసిన తర్వాత తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించరు.

Notification Pdf  : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *