Govt. Schemes

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 25 వ తేదీ నే జీతాలు, పెన్షన్ :

calendar_month September 25, 2026 person chitra

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 25 వ తేదీ నే జీతాలు, పెన్షన్ :

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సెప్టెంబర్ 25నే :

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సెప్టెంబర్ నెలలో ముందుగానే అందనున్నాయి. బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ మొత్తాలను ముందుగానే చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు సాధారణ తేదీ కంటే ముందుగానే తమ బ్యాంకు ఖాతాల్లో మొత్తాలను పొందే అవకాశం ఉంది.

బ్యాంకుల సమ్మె కారణంగా జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకుల సమ్మె నేపథ్యంలో, సెప్టెంబర్ నెలకు సంబంధించిన మొత్తాలను ముందుగానే విడుదల చేయనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలాఖరులో జీతాలు అందుతాయి. అయితే ఈసారి బ్యాంకుల సమ్మె కారణంగా చెల్లింపులు ఆలస్యం కాకుండా ముందుగానే చెల్లింపులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో అర్హత ఉన్న ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాల్లో జీతం క్రెడిట్ అయిన తర్వాత నగదు వినియోగించుకోవచ్చు.

సెప్టెంబర్ 25నే జీతాలు, పెన్షన్ :

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ 25, 2026నే జీతాలు, పెన్షన్ మొత్తాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. సాధారణంగా నెలాఖరులో అందే చెల్లింపులను బ్యాంకుల సమ్మెను దృష్టిలో ఉంచుకుని ముందుగా చెల్లించేందుకు అనుమతించారు.

ఈ ముందస్తు చెల్లింపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వర్తించనుంది.

అడ్వాన్స్ పేమెంట్‌గా పరిగణింపు :

సెప్టెంబర్ నెలకు ముందుగా చెల్లించే జీతాలు, పెన్షన్ మొత్తాలను అడ్వాన్స్ పేమెంట్‌గా పరిగణిస్తారు. సంబంధిత లెక్కలు పూర్తిగా ఖరారైన తర్వాత అక్టోబర్ నెల చెల్లింపుల్లో అవసరమైన మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నట్లు సమాచారం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అంటే బ్యాంకుల సమ్మె కారణంగా జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో ఆలస్యం లేదా ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సెప్టెంబర్ నెలకు సంబంధించిన మొత్తాలను ముందుగానే పొందే అవకాశం ఉంది.

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *