AP Jobs

ECHS Recruitment 2026: ఏపీ, తెలంగాణలో 96 ఉద్యోగాలు.. 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత!

calendar_month September 30, 2026 person chitra

ECHS Recruitment 2026: ఏపీ, తెలంగాణలో 96 ఉద్యోగాలు.. 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత!

ECHS Recruitment 2026:

Ex-Servicemen Contributory Health Scheme (ECHS) నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ECHS Polyclinics‌లో వివిధ Medical, Para-Medical, Non-Medical పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 96 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు పోస్టును బట్టి MD/MS, MBBS, BDS, డిగ్రీ, B.Pharmacy, DMLT, B.Sc Nursing, డిప్లొమా, 8వ తరగతి తదితర విద్యార్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ECHS Polyclinics‌లో పోస్టింగ్ ఇస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని నిబంధనలను పరిశీలించి ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : Ex-Servicemen Contributory Health Scheme (ECHS) లో ఉద్యోగాలు

నోటిఫికేషన్: Station HQ, ECHS Cell, Secunderabad

మొత్తం ఖాళీలు: 96

ఉద్యోగ ప్రదేశం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఉద్యోగాలు ఉన్న ప్రాంతాలు:

ఆంధ్రప్రదేశ్ : 

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గిద్దలూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ECHS Polyclinics‌కు పోస్టులు ఉన్నాయి.

తెలంగాణ : 

తెలంగాణలో గోల్కొండ, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సైనిక్‌పురి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి.

ECHSలో పోస్టుల వివరాలు : 

పోస్టు పేరు ఖాళీలు
Medical Specialist 04
Medical Officer 22
Dental Officer 10
Officer-in-Charge 03
Dental AT/H 06
Pharmacist 12
Lab Technician 07
Lab Assistant 01
Nursing Assistant 03
Physiotherapist 03
Data Entry Operator/Clerk 04
Clerk 02
Female Attendant 02
Chowkidar 04
Safaiwala 08
Peon 05
మొత్తం 96

విద్యార్హతలు:

పోస్టును బట్టి వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ముఖ్యంగా MD/MS, MBBS, BDS, Graduate, B.Pharmacy, DMLT, B.Sc Nursing, Diploma, 8వ తరగతి తదితర అర్హతలు ఉన్నవారు సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కొన్ని పోస్టులకు Armed Forces/Ex-Servicemenకు సంబంధించిన ప్రత్యేక అర్హతలు లేదా అనుభవం అవసరం కావచ్చు.

ఉద్యోగ కాలం :

ఈ పోస్టులకు నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగ కాలం వేర్వేరుగా ఉంటుంది.

Ex-Servicemen (ESM)/మరణించిన సైనికుల భార్యలకు: 12 నెలలు

Civilian అభ్యర్థులకు: 11 నెలలు

నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం తదుపరి కాలానికి సంబంధించిన వివరాలు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం :

ECHS ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. ఇందుకోసం అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన Application Formను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలతో నింపాలి.

అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవం, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అవసరమైన ఇతర ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జత చేసి నిర్ణీత చిరునామాకు దరఖాస్తు పంపాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులను అంగీకరించరు.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా :

Officer-in-Charge,
Station HQ ECHS Cell,
HQ TASA, Near Rastrapati Nilayam,
Secunderabad – 500010, Telangana.

ముఖ్యమైన తేదీ :

దరఖాస్తు చివరి తేదీ: 04 అక్టోబర్ 2026

ముఖ్యమైన సూచనలు :

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. ముఖ్యంగా పోస్టుల వారీగా విద్యార్హతలు, వయస్సు, అనుభవం, రిజిస్ట్రేషన్, Ex-Servicemen‌కు సంబంధించిన నిబంధనలు, అవసరమైన సర్టిఫికెట్లు వంటి వివరాలను పరిశీలించాలి.

Notification Pdf : Click Here

Application Pdf : Click Here

Official Website : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *