పరీక్ష లేకుండా 10th అర్హతతో Income Tax Department లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Income Tax Department Jobs Notification 2026 Apply Now :
IT Dept Jobs Recruitment 2026 :
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ శాఖ నుండి శుభవార్త వచ్చింది. IT Dept నుంచి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసారు. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత ఏమిటంటే పరీక్ష లేకుండా, కేవలం 10వ తరగతి అర్హతతోనే ఉద్యోగాలకు ఎంపిక చేసే అవకాశం కల్పించడం. కావున తక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో స్పోర్ట్స్ కోట విధానం లో 97 పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10th , ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఈ ఉద్యోగాలకి వయస్సు కూడా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Income Tax Dept Jobs Notification 2026 – ముఖ్యమైన వివరాలు:
సంస్థ పేరు: IT Department లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
Income Tax Department ద్వారా విడుదలైన ఈ నోటిఫికేషన్‌లో వివిధ గ్రూప్ C పోస్టులు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా
1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)
2. టాక్స్ అసిస్టెంట్
3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 97
విద్య అర్హతలు:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS):
1. అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి.
2. గుర్తింపు పొందిన బోర్డు నుండి చదువు పూర్తి చేసి ఉండాలి.
3. ఎటువంటి డిగ్రీ లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు.
టాక్స్ అసిస్టెంట్ :
1. అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ (Any Degree) ఉత్తీర్ణులై ఉండాలి.
2. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
3. డేటా ఎంట్రీ స్కిల్ అవసరం.
4. ఇంగ్లిష్ టైపింగ్: కనీసం 8000 డిప్రెషన్స్ పర్ అవర్, లేదా హిందీ టైపింగ్: కనీసం 7000 డిప్రెషన్స్ పర్ అవర్
5. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది
6. డిగ్రీ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ శాఖలో మంచి జీతంతో ఉద్యోగ అవకాశం.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – II (Stenographer Grade II):
1. 2. అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతి (Intermediate) ఉత్తీర్ణులై ఉండాలి.
2. గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
3. స్టెనోగ్రఫీ స్కిల్ తప్పనిసరి.
4. ఇంగ్లిష్ స్టెనోగ్రఫీ: 80 పదాలు నిమిషానికి (WPM), లేదా హిందీ స్టెనోగ్రఫీ: 80 WPM
5. కంప్యూటర్ మరియు టైపింగ్ పరిజ్ఞానం ఉన్నవారికి అదనపు ప్రాధాన్యత ఉంటుంది.
6. స్టెనోగ్రఫీ నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.
వయో పరిమితి:
1. కనీస వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. SC / ST / OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు రూ 200/- ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితం గా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం వివరాలు:
Income Tax Department లో ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది:
1. నెల జీతం: ₹35,000 – ₹60,000వరకు జీతం ఇస్తారు.
2. DA, HRA, TA వంటి ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి.
3. కేంద్ర ప్రభుత్వ పెన్షన్, మెడికల్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఎంపిక విధానం:
ఈ నోటిఫికేషన్‌లో ముఖ్యమైన విషయం ఏటంటే పరీక్ష లేకుండా ఎంపిక చేయడం. అభ్యర్థులను కింది విధంగా ఎంపిక చేస్తారు:
1. మెరిట్ లిస్ట్ ఆధారంగా
2. 10వ తరగతి మార్కుల ఆధారంగా
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. కొన్ని పోస్టులకు ఫిజికల్ ఫిట్‌నెస్ లేదా ట్రేడ్ స్కిల్ అవసరం ఉండవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
2. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
3. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
5. అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
6. కొన్ని పోస్టులకు ఆఫ్‌లైన్ దరఖాస్తు కూడా ఉండవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 07 జనవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 31 జనవరి 2026
Official Website : Click Here
Notification pdf : Click Here
Apply Link : Click Here