DGMA Recruitment 2026: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.75,000 జీతం…వెంటనే అప్లై చేసుకోండి.
DGMA Recruitment 2026: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.75,000 జీతం…వెంటనే అప్లై చేసుకోండి.
DGMA Recruitment 2026 :
DGMA ద్వారా మేనేజ్‌మెంట్ సపోర్ట్ అసోసియేట్ (Management Support Associate) పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75,000 ఏకీకృత పారితోషికం చెల్లించనున్నారు.
ఈ ఉద్యోగాలు ముంబైలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (Directorate General of Maritime Administration – DGMA) కార్యాలయంలో ఉంటాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 2026 అక్టోబర్ 23 నుంచి నవంబర్ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Directorate General of Maritime Administration (DGMA) లో ఉద్యోగాలు
పోస్టు పేరు : Management Support Associate (MSA)
మొత్తం ఖాళీలు : 30
ఉద్యోగ స్థలం: ముంబై
ఉద్యోగ విధానం : కాంట్రాక్ట్ ప్రాతిపదికన
విద్యార్హతలు :
మేనేజ్‌మెంట్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు కూడా అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి.
వయోపరిమితి :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సును 2026 అక్టోబర్ 23 నాటికి లెక్కిస్తారు. వయోపరిమితికి సంబంధించి ఇతర నిబంధనలు లేదా సడలింపులు ఉంటాయి. అధికారిక నోటిఫికేషన్‌లో చూడచ్చు.
జీతం వివరాలు :
DGMA Management Support Associate పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75,000 ఏకీకృత పారితోషికం అందిస్తారు. అయితే EPF, ESI, TDS, వృత్తి పన్ను వంటి వర్తించే కోతలు ఉండవచ్చు. అందువల్ల చేతికి అందే వేతనం రూ.75,000 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
1. ముందుగా DGMA అధికారిక వెబ్‌సైట్ https://dgma.gov.in ను సందర్శించండి.
2. Recruitment లేదా Careers విభాగాన్ని తెరవండి.
3. Management Support Associate Recruitment 2026 నోటిఫికేషన్‌ను పరిశీలించండి.
4. విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, ఇతర నిబంధనలను పూర్తిగా చదవండి.
5. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అవసరమైన వివరాలను నమోదు చేయండి.
6.అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, దరఖాస్తులోని వివరాలను సరిచూసుకున్న తర్వాత అప్లికేషన్‌ను సమర్పించండి.
7. దరఖాస్తు సమర్పించిన తర్వాత కన్ఫర్మేషన్ లేదా అప్లికేషన్ కాపీని భద్రపరచుకోండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 23 అక్టోబర్ 2026
దరఖాస్తు చివరి తేదీ : 12 నవంబర్ 2026
Notification Pdf Click Here
Official Website Click Here