TS Ayush Outsourcing Recruitment 2026: 7వ తరగతి అర్హతతో ఉద్యోగాలు.. జీతం , అర్హతలు, జీతం, దరఖాస్తు వివరాలు ఇవే !
TS Ayush Outsourcing Recruitment 2026: 7వ తరగతి అర్హతతో ఉద్యోగాలు.. జీతం , అర్హతలు, జీతం, దరఖాస్తు వివరాలు ఇవే !
జాతీయ ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు 2026 :
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. హనుమకొండ జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో వివిధ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నియామకాల్లో ఆయుష్ మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, సైకోసోషల్ కౌన్సెలర్, యోగా ప్రొఫెషనల్, మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి 7వ తరగతి నుంచి సంబంధిత డిగ్రీ వరకు విద్యార్హతలు అవసరం. నెలవారీ వేతనం గరిష్ఠంగా రూ.40,000 వరకు ఉంటుంది.
TS Ayush Outsourcing Recruitment 2026 ముఖ్యమైన వివరాలు :
నియామక సంస్థ: జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం, హనుమకొండ లో ఉద్యోగాలు
పథకం: జాతీయ ఆయుష్ మిషన్ (NAM)
నియామక విధానం: అవుట్‌సోర్సింగ్
మొత్తం ఖాళీలు: 08
పోస్టుల వారీగా ఖాళీలు, జీతం వివరాలు :
| పోస్టు పేరు | ఖాళీలు | వేతనం |
|---|---|---|
| ఆయుష్ మెడికల్ ఆఫీసర్ | 3 | రూ.40,000 |
| ఫార్మసిస్ట్ | 1 | రూ.15,000 |
| సైకోసోషల్ కౌన్సెలర్ | 1 | ఒక్కో సెషన్‌కు రూ.500 |
| యోగా ప్రొఫెషనల్ | 1 | రూ.28,000 |
| మల్టీ పర్పస్ వర్కర్ (MPW) | 2 | రూ.15,000 |
| మొత్తం | 8 |
విద్యార్హతలు :
1. ఆయుష్ మెడికల్ ఆఫీసర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆయుర్వేదం, యునాని, హోమియోపతి లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న సంబంధిత వైద్య విధానంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అవసరమైన ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేయాలి.
2. ఫార్మసిస్ట్: D.Pharmacy, B.Pharmacy లేదా Pharm.D అర్హత ఉండాలి. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
3. సైకోసోషల్ కౌన్సెలర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ (MSW) పొందిన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులు.
4. యోగా ప్రొఫెషనల్: నోటిఫికేషన్‌లో సూచించిన అర్హతల ప్రకారం నేచురోపతి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ కలిగి ఉండాలి.
5. మల్టీ పర్పస్ వర్కర్ (MPW): కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సైకిల్ లేదా మోటార్‌సైకిల్ నడపగలగాలి.
వయోపరిమితి, వయోసడలింపు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సును 2026 జూలై 1వ తేదీ నాటికి లెక్కిస్తారు.
నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, మాజీ సైనికులకు వర్తించే నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపికను జిల్లా ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది. ఎంపిక ప్రక్రియలో మొత్తం 100 మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
ఆయుష్ మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, సైకోసోషల్ కౌన్సెలర్, యోగా ప్రొఫెషనల్ పోస్టులకు అర్హత పరీక్షలో సాధించిన మార్కులకు 90 మార్కుల వెయిటేజీ ఉంటుంది.
మల్టీ పర్పస్ వర్కర్ పోస్టుకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
అన్ని పోస్టులకు వయస్సు ఆధారంగా గరిష్ఠంగా 10 మార్కుల వెయిటేజీ ఉంటుంది.
మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు తేదీలు, సమర్పించాల్సిన చిరునామా :
దరఖాస్తు ప్రారంభ తేదీ: 22 అక్టోబర్ 2026.
దరఖాస్తు చివరి తేదీ: 28 అక్టోబర్ 2026
అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పని దినాల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలి.
దరఖాస్తులను స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా కింది చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా:
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం,
ఎస్-16, రెండో అంతస్తు,
ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (IDOC),
హనుమకొండ జిల్లా – 506001, తెలంగాణ.
దరఖాస్తుతో జతచేయాల్సిన ధ్రువపత్రాలు :
అభ్యర్థులు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా కింది పత్రాలను సిద్ధం చేసుకోవాలి.
పదో తరగతి, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు (వర్తించే చోట)
సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు
అవసరమైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు
కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
స్థానికత లేదా నివాస ధ్రువీకరణ పత్రం
దివ్యాంగుల లేదా మాజీ సైనికుల ధ్రువపత్రాలు (వర్తిస్తే)
తాజా ఫొటో, ఇతర అవసరమైన పత్రాలు
అవసరమైన ధ్రువపత్రాల ప్రతులను నోటిఫికేషన్ సూచనల ప్రకారం గెజిటెడ్ అధికారి ద్వారా ధ్రువీకరించాలి.
ఉద్యోగ కాలవ్యవధి :
ఈ నియామకాలు 2027 మార్చి 31 వరకు అవుట్‌సోర్సింగ్ విధానంలో కొనసాగనున్నాయి. ఆ తర్వాత సేవలను కొనసాగించాలా లేదా అనేది అవసరం, పనితీరు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ముఖ్యమైన సూచన :
హనుమకొండ జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలు వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించాలి. మల్టీ పర్పస్ వర్కర్ పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా ఉండటంతో, అర్హత కలిగిన అభ్యర్థులు గడువులోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు వివరాలు: Hanumakonda District Official Website