telangana jobs

తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి అర్హతతో మిషన్ శక్తి పథకంలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

calendar_month November 16, 2026 person chitra

తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి అర్హతతో మిషన్ శక్తి పథకంలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

మిషన్ శక్తి పథకంలో ఉద్యోగాలు :

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం. మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలోని డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ (DHEW) విభాగంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నియామకాలను కేంద్ర ప్రభుత్వ మిషన్ శక్తి పథకం కింద ఔట్‌సోర్సింగ్ విధానంలో చేపడుతున్నారు. మొత్తం 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డిస్ట్రిక్ట్ మిషన్ కో-ఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు ఉన్నాయి. MTS ఉద్యోగానికి 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అర్హత కలిగిన అభ్యర్థులు 2026 నవంబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

శాఖ : మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు

పథకం : మిషన్ శక్తి

సంస్థ పేరు : DHEW నల్లగొండ లో ఉద్యోగాలు

ఉద్యోగాల రకం : ఔట్‌సోర్సింగ్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు : 04

ఖాళీల వివరాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

పోస్టు పేరు ఖాళీలు
డిస్ట్రిక్ట్ మిషన్ కో-ఆర్డినేటర్ 1
జెండర్ స్పెషలిస్ట్ 2
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) 1
మొత్తం 4

విద్యార్హతలు :

1. డిస్ట్రిక్ట్ మిషన్ కో-ఆర్డినేటర్:

1. సాంఘిక శాస్త్రాలు, జీవశాస్త్రాలు, పోషకాహారం, వైద్యం, ఆరోగ్య నిర్వహణ, సాంఘిక సేవ లేదా గ్రామీణ నిర్వహణ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. సంబంధిత రంగంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

2. జెండర్ స్పెషలిస్ట్:

1. సోషల్ వర్క్ లేదా ఇతర సామాజిక విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

2. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

3. లింగ సమానత్వానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS):

గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 విధానంలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి :

1. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జూలై 2026 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.15,600 నుంచి రూ.38,500 వరకు వేతనం చెల్లిస్తారు.

ఎంపిక విధానం :

1. ఈ ఉద్యోగాల భర్తీ ఔట్‌సోర్సింగ్ విధానంలో జరుగుతుంది. అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

2. దరఖాస్తుల పరిశీలన.

3. అర్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్.

4. ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ.

5. తుది ఎంపిక.

6. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందిస్తారు.

దరఖాస్తు విధానం :

అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా నల్లగొండ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

అనంతరం దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపి, అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలు, వయస్సు ధ్రువీకరణ పత్రం, అనుభవ ధ్రువపత్రాలు మరియు ఇతర అవసరమైన పత్రాలను జతచేయాలి.

పూర్తి చేసిన దరఖాస్తులను కింది చిరునామాలో సమర్పించాలి.

దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా:

జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం,

మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ,

సంక్షేమ భవన్, కలెక్టరేట్,

నల్లగొండ జిల్లా, తెలంగాణ.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ తేదీలు: 16 నవంబర్ 2026 నుంచి 21 నవంబర్ 2026 వరకు.

దరఖాస్తు చివరి తేదీ: 21 నవంబర్ 2026

గడువు ముగిసిన తర్వాత పోస్టు ద్వారా ఆలస్యంగా అందిన దరఖాస్తులను స్వీకరించరు.

Notification Pdf  : Click Here

Application Pdf  : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *