CSIR MTS Recruitment 2026 – 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 23 MTS పోస్టులు…వెంటనే అప్లై చేసుకోండి.
CSIR MTS Recruitment 2026 – 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 23 MTS పోస్టులు…వెంటనే అప్లై చేసుకోండి.
CSIR MTS Recruitment 2026:
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), డ్రైవర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 23 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన భారతీయ పౌరులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పోస్టుల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతం, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో ఉద్యోగాలు
నోటిఫికేషన్ పేరు: CSIR Recruitment 2026
పోస్టుల పేరు: MTS, Driver, Security Officer తదితర పోస్టులు
మొత్తం ఖాళీలు: 27
ఉద్యోగ రకం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
విద్యార్హతలు :
ఈ నియామకానికి పోస్టును బట్టి వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు.
సెక్యూరిటీ ఆఫీసర్:
1. మాజీ సైనికులు లేదా పారామిలిటరీ దళాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
2. JCO (సుబేదార్ లేదా అంతకంటే పై స్థాయి) లేదా సమానమైన హోదా కలిగి ఉండాలి.
3. సాధారణంగా భద్రతా విభాగంలో 10 సంవత్సరాల అనుభవం అవసరం.
4. కొన్ని ప్రత్యేక హోదాలకు 5 సంవత్సరాల అనుభవం సరిపోతుంది.
సెక్యూరిటీ అసిస్టెంట్ / వాచ్ & వార్డ్ అసిస్టెంట్:
1. మాజీ సైనికులు అయి ఉండాలి.
2. సైన్యంలో JCO లేదా పారామిలిటరీ దళాల్లో సమానమైన హోదా కలిగి ఉండాలి.
3. భద్రతా విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరం.
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్:
1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
2. డిగ్రీ స్థాయిలో హిందీ లేదా ఇంగ్లీష్ తప్పనిసరి లేదా ఐచ్ఛిక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
3. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇతర మాస్టర్స్ డిగ్రీ అర్హతలు కలిగినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
డ్రైవర్:
1. పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
2. LMV మరియు HMV వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
3. కనీసం 3 సంవత్సరాల మోటారు కారు డ్రైవింగ్ అనుభవం అవసరం.
4. వాహనాల్లో చిన్నపాటి లోపాలను గుర్తించి సరిచేసే పరిజ్ఞానం ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS):
1. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులై ఉండాలి.
2. ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా అర్హులు.
వయోపరిమితి :
కనీస వయస్సు: 18 సంవత్సరాలు.
గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు.
దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు.
SC/ST/OBC (NCL) అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
రిజర్వేషన్ లేని (UR) ఖాళీలకు దరఖాస్తు చేసే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోసడలింపు వర్తించదు.

దరఖాస్తు రుసుము :
1. జనరల్ మరియు ఇతర ఫీజు మినహాయింపు లేని అభ్యర్థులు: ₹500/-
2. మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
3. SC/ST అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
4. దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
5. మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
6. దరఖాస్తు ఫీజును SBI Collect ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
CSIR ఉద్యోగాలకు జీతభత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి 7వ వేతన సంఘం పే మ్యాట్రిక్స్ ప్రకారం జీతాలు చెల్లిస్తారు.
| పోస్టు పేరు | పే లెవెల్ | జీతం |
|---|---|---|
| సెక్యూరిటీ ఆఫీసర్ | Level 7 | ₹44,900 – ₹1,42,400 |
| సెక్యూరిటీ అసిస్టెంట్ | Level 6 | ₹35,400 – ₹1,12,400 |
| జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ | Level 6 | ₹35,400 – ₹1,12,400 |
| డ్రైవర్ | Level 2 | ₹19,900 – ₹63,200 |
| MTS | Level 1 | ₹18,000 – ₹56,900 |

ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా CSIR అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌ను( https://www.csir.res.in/career-opportunities/recruitment వెబ్‌సైట్‌ను లేదా https://recruitment.csir.res.in ) సందర్శించాలి.
2. సంబంధిత రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయాలి.
3. అభ్యర్థులు తమకు అర్హత ఉన్న పోస్టును ఎంచుకోవాలి.
4. ఆన్‌లైన్ దరఖాస్తులో అవసరమైన వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
5. అవసరమైన సర్టిఫికెట్లు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
6. వర్తించే దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
7. దరఖాస్తును సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 20 నవంబర్ 2026
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 21 డిసెంబర్ 2026
Notification Pdf : Click Here
Apply Online Link : Click Here