నవంబర్ 27న కడప లో భారీ జాబ్‌మేళా.. 12 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు .. మిస్ అవ్వొద్దు.!
నవంబర్ 27న కడప లో భారీ జాబ్‌మేళా.. 12 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు .. మిస్ అవ్వొద్దు…!
కడప లో భారీ జాబ్ మేళా 2026 :
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశం అందుబాటులోకి వచ్చింది. వైఎస్సార్ కడప జిల్లాలోని ఖాజీపేటలో ఈ నెల నవంబర్ 27న భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగ మేళాలో మొత్తం 12 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి.
ఈ జాబ్‌మేళాలో Vishal Mart, AIL Dixon, Maruti Suzuki, LIC, Foxconn, Wipro Infrastructure Engineering, AU Small Finance Bank, TeamLease తదితర ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు నేరుగా జాబ్‌మేళాకు హాజరై ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.
జాబ్‌మేళాలో పాల్గొనే 12 కంపెనీల వివరాలు :
ఈ ఉద్యోగ మేళాలో వివిధ రంగాలకు చెందిన 12 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఆయా సంస్థల్లో భర్తీ చేయనున్న ఉద్యోగ ఖాళీల వివరాలు కింది పట్టికలో చూడవచ్చు.
| క్రమ సంఖ్య | కంపెనీ పేరు | ఖాళీలు |
|---|---|---|
| 1 | Vishal Mart | 10 |
| 2 | AIL Dixon | 50 |
| 3 | Maruti Suzuki Showroom | 10 |
| 4 | LIC | 50 |
| 5 | TEXPORT Texana World Pvt. Ltd. | 50 |
| 6 | Channel Play | 50 |
| 7 | AU Small Finance Bank Ltd. | 50 |
| 8 | TeamLease | 50 |
| 9 | Sri Ram Life Insurance | 50 |
| 10 | Foxconn (iPhone Manufacturing) | 50 |
| 11 | DONO BPO & IT Solutions OPC Pvt. Ltd. | 50 |
| 12 | Wipro Infrastructure Engineering Pvt. Ltd. | 50 |
జాబ్‌మేళా పూర్తి వివరాలు :
జాబ్‌మేళా నిర్వహించే జిల్లా: వైఎస్సార్ కడప
జాబ్‌మేళా తేదీ: నవంబర్ 27, 2026
నిర్వహించే ప్రదేశం: సాహిత్య డిగ్రీ కళాశాల
వేదిక: ఖాజీపేట, వైఎస్సార్ కడప జిల్లా
పాల్గొనే కంపెనీలు: 12
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9182335843
విద్యార్హతలు, ఎంపిక విధానం :
ఈ జాబ్‌మేళాలో పాల్గొనే కంపెనీలను బట్టి ఉద్యోగాలకు అవసరమైన విద్యార్హతలు, ఇతర అర్హతలు మారవచ్చు. అభ్యర్థులకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి తగిన ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
కాబట్టి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా అవకాశాలను పరిశీలించి జాబ్‌మేళాకు హాజరుకావాలి. ఖచ్చితమైన అర్హతలు, జీతభత్యాలు, ఉద్యోగ బాధ్యతలకు సంబంధించిన వివరాలను కంపెనీ ప్రతినిధుల వద్ద తెలుసుకోవచ్చు.
జాబ్‌మేళాకు వెళ్లే అభ్యర్థులకు ముఖ్య సూచనలు :
1. నవంబర్ 27, 2026న ఉదయం జాబ్‌మేళా వేదికకు చేరుకోవాలి.
2. తాజా రెజ్యూమ్ (Resume) వెంట తీసుకెళ్లాలి.
3. విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాలి.
4. ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను వెంట ఉంచుకోవాలి.
5. పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకెళ్లడం మంచిది.
6. ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ప్రతినిధుల వద్ద తెలుసుకోవాలి.