పదవ తరగతి అర్హతతో రైల్వే లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Railway Group D Jobs Notification 2026 Apply Now :

పదవ తరగతి అర్హతతో రైల్వే లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Railway Group D Jobs Notification 2026 Apply Now :

Railway Group D Jobs Notification 2026 పూర్తి వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా పదవ తరగతి అర్హతతో రైల్వే గ్రూప్ D జాబ్స్ 2026 కోసం దేశవ్యాప్తంగా భారీగా ఖాళీలు భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఆశించే అభ్యర్థులకు పదవ తరగతి అర్హతతో రైల్వే గ్రూప్ D జాబ్స్ 2026 ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.ఈ రైల్వే జాబ్స్ కి పదవ తరగతి పాస్ ఐన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 22,000 పోస్టులతో రైల్వే గ్రూప్ D లెవెల్ వన్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ 31 జనవరి 2026 న విడుదల చేయనున్నారు. అంతే కాకుండా వయస్సు కూడా 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫీజికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రైల్వే గ్రూప్–D ఉద్యోగాల వివరాలు:

Railway Recruitment Board (RRB) ద్వారా గ్రూప్–D కేటగిరీలో వివిధ పోస్టుల కోసం నియామకాలు చేపడతారు. ఇందులో ట్రాక్ మెయింటైనర్, హెల్పర్, అసిస్టెంట్ పాయింట్స్‌మన్, పోర్టర్, లెవల్–1 పోస్టులు వంటి ఉద్యోగాలు ఉంటాయి

సంస్థ పేరు: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు: గ్రూప్ D లెవెల్ 1 పోస్టులు

మొత్తం పోస్టులు : 22,000

విద్య అర్హతలు:

రైల్వే గ్రూప్ D లెవెల్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదవ తరగతి అర్హత ఉంటె అప్లై చేసుకోవచ్చు. హైయర్ Qualification ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయో పరిమితి:

1. కనీసం 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. SC /ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు , OBC అభ్యర్థులకు 3 ఇయర్స్ వయస్సు లో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

Railway Group D Jobs Notification 2026 కోసం అభ్యర్థులు కేటగిరీని బట్టి దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు ఈ విధంగా ఉంటాయి:

1. జనరల్ (UR) / OBC అభ్యర్థులు: ₹500
(CBT పరీక్షకు హాజరైన తర్వాత ఇందులో నుంచి కొంత మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తారు)

2. SC / ST / మహిళా అభ్యర్థులు / PwBD / మాజీ సైనికులు: ₹250
(CBT పరీక్షకు హాజరైతే మొత్తం ఫీజు రీఫండ్ చేయబడుతుంది).

అప్లికేషన్ విధానం: ఆన్లైన్

శాలరీ వివరాలు:

1. రైల్వే గ్రూప్–D ఉద్యోగాలకు 7వ వేతన సంఘం ప్రకారం జీతం చెల్లిస్తారు.

2. ప్రారంభ జీతం సుమారు రూ.45,000 /-నెలకు ఉంటుంది.

3. దీనితో పాటు DA, HRA, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ సౌకర్యాలు, పెన్షన్ లాంటి ప్రభుత్వ లాభాలు కూడా అందుతాయి.

ఎంపిక విధానం:

Railway Group D Jobs 2026 ఎంపిక విధానం పలు దశలుగా జరుగుతుంది.

1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు.

2. ఈ పరీక్షలో సాధారణ విజ్ఞానం, గణితం, రీజనింగ్, జనరల్ సైన్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

3. CBTలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) నిర్వహిస్తారు.

4. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. Railway Group D Jobs Notification 2026 కోసం అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేయాలి.

2. RRB అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయాలి.

3. అప్లికేషన్ ఫారమ్‌లో వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.

4. దరఖాస్తు రుసుము వర్గాన్ని బట్టి ఉంటుంది.

5. ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 31 జనవరి 2026

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 31 జనవరి 2026

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 2 మార్చ్ 2026

Official Website: Click Here

Notification pdf : Click Here

Apply Online : Click Here

Leave a Comment