AP Inter Hall Tickets 2026: ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల – ఇలా డౌన్లోడ్ చేసుకోండి?
ఇంటర్మీడియట్ హాల్ టికెట్ విడుదల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం . AP Inter Hall Tickets 2026 ను ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది. ఈ హాల్ టికెట్లు 2026లో జరగబోయే 1వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని బోర్డు స్పష్టం చేసింది. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తమ హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ఈ హాల్ టికెట్‌లో విద్యార్థి పేరు, రోల్ నెంబర్, పరీక్ష తేదీలు, పరీక్ష కేంద్రం వివరాలు ఉంటాయి.
AP Inter Hall Tickets 2026 ముఖ్యమైన వివరాలు:
AP ఇంటర్మీడియట్ బోర్డు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 2026 ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి నెలలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హాల్ టికెట్లు ముందుగానే విడుదల చేయడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తం గా 2025-56 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ 1st అండ్ 2nd ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ 23 ఫిబ్రవరి 2026 నుంచి మొదలు అవుతున్నాయి.అంతేకాదు ప్రాక్టీకల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తి విద్యా కోర్స్ లకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరగనున్నాయి. టైమింగ్స్ కూడా ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఇంటర్ ప్రాక్టీకల్స్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1 నుండి స్టార్ట్ అవుతున్న ప్రాక్టీకల్స్ పరీక్షలకి సంబంధించి హాల్ టికెట్స్ ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
ఈ మేరకు బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ( BIEAP ) హాల్ టికెట్స్ శనివారం 24 జనవరి నుంచి అందుబాటులో ఉంచింది. ప్రాక్టీకల్స్ కి హాజరు రావాల్సిన విద్యార్థులు అధికారిక వెబ్సైటు లోకి https://bie.ap.gov.in/ వెళ్లి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి.
హాల్ టికెట్‌ను
మొబైల్ ద్వారా,
ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ద్వారా,
లేదా కాలేజ్ ద్వారా కూడా పొందవచ్చు.
విద్యార్థులు తమ జన్మ తేదీ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఉపయోగించి హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో హాల్ టికెట్ ఎలా పొందాలి:
1. ముందుగా AP Inter Board అధికారిక వెబ్‌సైట్ కు వెళ్లాలి.
2. “AP Inter Hall Ticket 2026” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
3. అక్కడ అడిగిన వివరాలు (జన్మ తేదీ / రోల్ నెంబర్) నమోదు చేయాలి.
4. Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
5. మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
6. దాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.